26, ఏప్రిల్ 2018, గురువారం

నిజమైన జర్నలిస్టు - నార్ల వారు.. ఆయన ఎడిటర్, సంపాదకుడు కాదు. 1956-1974 మధ్య కాలంలోనే సొమ్ముకు అమ్ముడుపోయే పాత్రికేయులను ఇలా చీల్చి చెండాడారు.. నవయుగాల బాట- నార్ల మాట నుంచీ కొన్ని... *ఎడిట రైన వాడు బిడియము చూపుచో ధాటితగ్గు వృత్తి ధర్మమందు; కడుపుకూటి వ్రాత కక్కుర్తి వ్రాతరా నవయుగాల బాట- నార్ల మాట! *వర్తమాన జగతి పరివర్తనాలపై స్వేచ్ఛతోడ వ్యాఖ్య సేయనట్టి ఎడిటరెందుకోయి ఏటిలో గలవనా? నవయుగాల..... *నీతి నియతిలేని నీచుని చేతిలో పత్రికుండెనేని ప్రజకు చేటు; హంత చేత కత్తి గొంతులు కోయురా నవయుగాల... *ప్రజల సరస నిలిచిప్రధనమ్ము నడుపుట ప్రధమధర్మమోయి పత్రికలకు ప్రభుత పాదసేవ పత్రికలేలరా? నవయుగాల... *నిజము కప్పి పుచ్చి, నీతిని విడనాడి స్వామి సేవ చేయు జర్నలిస్టు తార్చువానికంటే తక్కువ వాడురా; నవయుగాల... *ఎడిటరైనవాడు ఏమైన వ్రాయును ముల్లె యొకటె తనకు ముఖ్యమైన పడపు వృత్తిలోన పట్టింపులుండునా నవయుగాల... *పత్రికారచనను పడపు వృత్తిగ మార్చు వెధవకంటె పచ్చి వేశ్యమేలు; తనువునమ్ము వేశ్య, మనసునుకాదురా నవయుగాల....

*ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై యారంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్ననిహన్య మానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్*

17, ఏప్రిల్ 2018, మంగళవారం

డాక్టర్ డి. నారాయణరెడ్డి, సెక్సీలజిస్ట్ గారి మాటల్లో, మాస్టారూ! సెక్సువల్‌ ఫ్రీక్వెన్సీకి సంబంధించి అంతర్జాతీయంగా చాలా అధ్యయనాలు జరిగాయి. ఏ రెండు అధ్యయన ఫలితాలూ ఒకేలా లేవు. ప్రఖ్యాత సెక్సాలజిస్టు ఆల్‌ఫ్రెడ్‌ కిన్సే సర్వేనే తీసుకుందాం. ముప్పై ఏళ్లలో ఒక్కసారంటే ఒక్కసారే సెక్స్‌లో పాల్గొన్న వ్యక్తి ఆయనకు తారసపడ్డాడు. అదే సమయంలో, రోజుకు మూడునాలుగుసార్లు అవలీలగా లైంగిక చర్యలో పాల్గొనే మన్మథరావులూ ఎదురయ్యారు. ఇవన్నీ పరిశీలించాక... రోజుకు ఎన్నిసార్లు అయితే సాధారణమో, ఎన్నిసార్లు అయితే అసాధారణమో ఓపట్టాన తేల్చలేక అంతటి మహానుభావుడే చేతులెత్తేశాడు. సెక్సాలజీలో పురుషత్వానికి సంబంధించి ఐఎస్‌ఐ మార్కుల్లాంటివేం లేవు. స్వచ్ఛమైన బంగారంలా అచ్చమైన మగాడికి హాల్‌మార్క్‌ ఇచ్చే వ్యవస్థలూ లేవు. సాధారణంగా.... పెళ్లయిన కొత్తలో రోజువారీ స్కోరు... ఆరోహణ క్రమంలో ఉంటుంది. మెల్లమెల్లగా అవరోహణ దారిపట్టి... పాతబడేకొద్దీ ఏదో ఓ అంకె దగ్గర స్థిరపడిపోతుంది. ఓ పరిశీలన ప్రకారం... పెళ్లయిన తొలి ఏడాది నెలకు పద్దెనిమిది సార్లు, తర్వాత ఓ ఐదేళ్లపాటూ నెలకు పదిహేనుసార్లు, ఆతర్వాత ఇంకో ఐదేళ్లు నెలకు తొమ్మిదిసార్లూ... పెళ్లయిన పదిహేనేళ్ల తర్వాత నెలకు ఏ రెండుమూడు సార్లకో పరిమితం - అన్నది ఓ అంచనా. బాధ్యతలు పెరిగిపోవడం, ఏకాంతం తగ్గిపోవడం, వృత్తి ఉద్యోగాల్లోని ఒత్తిడి, చిన్నాపెద్దా అనారోగ్యాలు... ఆ సగటు పడిపోడానికి కారణాలు. కబడ్డీ పాయింట్లతో టెన్నిస్‌ స్కోర్‌ను పోల్చగలమా? లేదు కదా! ఇదీ అంతే! ఎవరి జీవితం వారిది, ఎవరి ఆట వారిది! ఎన్నిసార్లు అన్నదానికంటే, ఎంత నాణ్యంగా ఆ కలయిక జరిగిందనేది ముఖ్యం. సూటిగా చెప్పాలంటే, సెక్స్‌ నంబర్‌గేమ్‌ కానే కాదు. అదో అనుభూతి క్రీడ! నువ్వు తృప్తి చెందుతున్నావా, జీవిత భాగస్వామికి తృప్తినిస్తున్నావా? - అన్నది ముఖ్యం. ప్రపంచంతో నీకేం పని? శృంగారం అంటే... సంభోగమే కాదు, సమభోగం కూడా! శృంగార నాణ్యతను నిర్ణయించడంలో ఫోర్‌ప్లే పాత్ర ముఖ్యమైనది. సెక్స్‌కు సంబంధించినంత వరకూ... నీ ఆటకు ... నువ్వే రెఫరీవి! నీ నైపుణ్యానికి ... నీ జీవిత భాగస్వామే తీర్పరి! అరమోడ్పు కళ్ళే ... ధ్రువీకరణ పత్రాలు! నిశ్శబ్దమైన నిట్టూర్పులే ... ప్రశంసావాక్యాలు!