29, అక్టోబర్ 2014, బుధవారం

 రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణజూచి రం
భోరుని జోరు దేశమున నుండగ బిల్చిన యిద్దురాత్ము దు
ర్వార మదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత! భ
గ్నోరుతరోరు జేయుధారుణిదు సుయోధను ఉగ్ర రణాంతరంబునన్!
కురువృద్ధుల్ గురువృద్ధ బాంధవులనేకుల్ చూచుచుండన్ మదో
ద్ధురుడై ద్రౌపదినిట్లు చేసిన ఖలున్ దుశ్శాసనున్ లోకభీ
కర లీలన్ వధియించి తద్విపుల వక్షశ్శైల రక్తౌఘ ని
ర్ఝర ముర్వీపతి చూచుచుండ అని నాస్వాదింతు నుగ్రాకృతిన్!

28, అక్టోబర్ 2014, మంగళవారం

మానసికంగా బలహీనమైనవారు తీగ లాంటి వారు
స్నేహం , బంధం , కులం మతం లాంటి ఆసరా కోరుకుంటారు , ఆధారపడతారు
మానసికంగా బలంగా ఉన్నవారు చెట్టులాంటి వారు
చెట్టుకి ఆలంబన అక్కర లేదు , భూమిలోపల వ్రేళ్ళు పాదుకుని ఉంటే చాలు ...

24, అక్టోబర్ 2014, శుక్రవారం



సంతోషమంటే ఆరోగ్యంగా ఉండటం, చేదు జ్ఞాపకాలను మరచిపోవటమే.


ఒక వయసు, కొన్ని అర్హతలు, కొన్ని పదవులు వచ్చాక..మనం వాడవలసిన పదాలు సరళంగా ఉండాలి.. శత్రువుని ఆక్షేపించేటప్పుడుకూడా మన వ్యక్తిత్వాని దర్పణం పట్టేట్లు ఉండాలి. పరుష పదజాల ప్రయోగం జనాలకు ఉత్ప్రేరకాలు కావొచ్చేమోకాని.. మన స్థాయిని అవి తగ్గిస్తాయి.

17, అక్టోబర్ 2014, శుక్రవారం

రాముడు పుట్టిందెప్పుడు? .... క్రీస్తు పూర్వం 7323 డిసెంబర్‌ 4న రాముడు జన్మించాడు. ఆరోజు సోమవారం. మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట మధ్య సమయంలో రాముడు జన్మించాడు. క్రీస్తుపూర్వం 7307 ఏప్రిల్‌ 7న సీతమ్మను రామచంద్రుడు శివధనుస్సును విరిచి వివాహం చేసుకున్నాడు. క్రీస్తుపూర్వం 7306 నవంబర్‌ 29న సీతాలక్ష్మణులతో కలిసి వనవాసానికి వెళ్లాడు. 7293 ఆగస్టు 7న రావణుడు సీతను అపహరించుకుని వెళ్లాడు. ఆరోజు అమావాస్య. ఆరోజు సూర్యగ్రహణం కూడా వచ్చింది. హనుమంతుడు సీత జాడను తెలుసుకోవటానికి 7292 సెప్టెంబర్‌ 1వ తేదీన లంకలో ప్రవేశించాడు. సెప్టెంబర్‌ 2న సీతాదేవిని దర్శించుకున్నాడు.. అదేరోజు రాత్రి లంకాదహనం జరిగింది. 7292 అక్టోబర్‌ 2న రామసైన్యం లంకకు బయలు దేరింది. 7292 అక్టోబర్‌ 31న లంకలో వానరసైన్యం ప్రవేశించింది. అంతకు ముందు అక్టోబర్‌ 26 నుంచి 30 మధ్య రోజుల్లో రామసేన సముద్రంపై అసాధారణమైన వారధిని నిర్మించింది. రామ రావణ యుద్ధం మొదలైంది 7292 నవంబర్‌ 3 న. నవంబర్‌ 7న రావణ సోదరుడు కుంభకర్ణుని రాముడు హతమార్చాడు. క్రీస్తుపూర్వం 7292 నవంబర్‌ 15న రావణ వధ జరిగింది. క్రీస్తుపూర్వం 7292 నవంబర్‌ 19కి రాముడి 14ఏళ్ల వనవాస కాలం ముగిసింది. ... (ఇలాంటి మరెన్నో ఆసక్తికర వివరాలతో వచ్చేస్తోంది.. సీనియర్ జర్నలిస్టు Kovela Santoshkumar రాసిన ‘దేవ రహస్యం’)

రాముడు పుట్టిందెప్పుడు?
....
క్రీస్తు పూర్వం 7323 డిసెంబర్‌ 4న రాముడు జన్మించాడు. ఆరోజు సోమవారం. మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట మధ్య సమయంలో రాముడు జన్మించాడు. 
క్రీస్తుపూర్వం 7307 ఏప్రిల్‌ 7న సీతమ్మను రామచంద్రుడు శివధనుస్సును విరిచి వివాహం చేసుకున్నాడు. క్రీస్తుపూర్వం 7306 నవంబర్‌ 29న సీతాలక్ష్మణులతో కలిసి వనవాసానికి వెళ్లాడు. 7293 ఆగస్టు 7న రావణుడు సీతను అపహరించుకుని వెళ్లాడు. ఆరోజు అమావాస్య. ఆరోజు సూర్యగ్రహణం కూడా వచ్చింది. హనుమంతుడు సీత జాడను తెలుసుకోవటానికి 7292 సెప్టెంబర్‌ 1వ తేదీన లంకలో ప్రవేశించాడు. సెప్టెంబర్‌ 2న సీతాదేవిని దర్శించుకున్నాడు.. అదేరోజు రాత్రి లంకాదహనం జరిగింది. 7292 అక్టోబర్‌ 2న రామసైన్యం లంకకు బయలు దేరింది. 7292 అక్టోబర్‌ 31న లంకలో వానరసైన్యం ప్రవేశించింది. అంతకు ముందు అక్టోబర్‌ 26 నుంచి 30 మధ్య రోజుల్లో రామసేన సముద్రంపై అసాధారణమైన వారధిని నిర్మించింది.
రామ రావణ యుద్ధం మొదలైంది 7292 నవంబర్‌ 3 న. నవంబర్‌ 7న రావణ సోదరుడు కుంభకర్ణుని రాముడు హతమార్చాడు.
క్రీస్తుపూర్వం 7292 నవంబర్‌ 15న రావణ వధ జరిగింది.
క్రీస్తుపూర్వం 7292 నవంబర్‌ 19కి రాముడి 14ఏళ్ల వనవాస కాలం ముగిసింది.
...
(ఇలాంటి మరెన్నో ఆసక్తికర వివరాలతో వచ్చేస్తోంది.. సీనియర్ జర్నలిస్టు Kovela Santoshkumar రాసిన ‘దేవ రహస్యం’)

14, అక్టోబర్ 2014, మంగళవారం

భూమి అంటే 'అమ్మ' మనకు అన్నం పెడుతుంది 
మొక్క తొలుచుకు వచ్చే ప్రతి సారీ ప్రసవ వేదన పడుతుంది 
కాయ, పండు తిని,కడుపు నిండిన బిడ్డలను 
మురిపెంగా చూసుకుంటుంది 
అలాంటి అమ్మకు ప్రపంచీకరణ అంటూ 
ఆధునికత పాఠాలు నేర్పి
అందమైన బొమ్మ
మురిపాల కొమ్మ
సేద తీర్చ దిగొచ్చిన రంభకి అమ్మ అంటూ
నగరీకరణ మోజుతో
పచ్చటి పల్లెలను
పార్కులుగా మారుస్తానంటే
సిమెంట్ కోక కట్టిచ్చి
రంగుటద్దాలు కుడతానంటే
ఆ పచ్చటి పల్లె తల్లి
కన్నీరు పెడుతుంది
నన్ను బిడ్డల కడుపాకలి తీర్చే
అమ్మగానే ఉండనివ్వమ౦టుంది
గద్దెనెక్కిన గాడ్దెకొడుకులకి
బుద్ధి చెప్పమంటూ
నిన్నూ నన్నూ అడుగుతుంది
గుండెలవిసేలా ఏడుస్తుంది....

గోదారొడ్డున రెల్లుగడ్డితో పాకొకటి వెయ్యాలి...ఆ పాకకి ఆనంద కుటీరమని పేరొకటి పెట్టాలి...పాపికొండలమీంచి పాక్కుంటూ పైకొచ్చే

నిన్న పోలవరం లో అచ్చం అలాంటి ఆశ్రమం నన్ను అహ్వానించింది.
నవంబర్ నుండి అది మా ట్రస్ట్ కార్యకలాపాలకు కేంద్రం కాబోతోంది.
అచ్చం నేను కలగన్నట్లే గోదావరి ఒడ్డు...ఇసుక తిన్నెలు...ఆకుపచ్చటి కొండలు...విస్తారంగా విరగబూసిన రెల్లు పూలు.భలే ఆనందం గా ఉంది.)
గోదారొడ్డున రెల్లుగడ్డితో పాకొకటి వెయ్యాలి...ఆ పాకకి ఆనంద కుటీరమని పేరొకటి పెట్టాలి...పాపికొండలమీంచి పాక్కుంటూ పైకొచ్చే
చందమామనో,సూర్యమామనో చూస్తూ కూర్చోవాలి.....ఆకుపచ్చటి కొండల మీంచి జల జల పారే జలపాతంలో నిలువెల్లా స్నానించాలి....
రెల్లుపూల పానుపుపై జల్లు జల్లుగా ఎవరో చల్లినారమ్మా వెన్నెల చల్లినారమ్మా అంటూ హాయిగా పాడుకోవాలి.....బంగారు వర్ణంలో మెరిసిపోయే ఇసుకతిన్నెల మీద ఎదురెదురుగా కూర్చుని పిచ్చుక గూళ్ళు కట్టుకోవాలి.....అమావాశ్యనాటి రాత్రి ఆకాశం నిండా వెలిగిపోయే నక్షత్రాల సొగసును తనివితీరా చూసెయ్యాలి.....నిండుపున్నమి రాత్రి వెన్నెల్లో పాపిడి కొండల మధ్య పడవ ప్రయాణం చెయ్యాలి......
నేస్తమా...నా ప్రాణ నేస్తమా...నా ఆనంద కుటీరం లో నీ రాక కోసం ఎదురుచూస్తున్నాను.ఎవరి పనుల్లో వాళ్ళం బిజినే....ఎవరి జీవితానికి వాళ్ళం బాధ్యులమే.
అయితేనేం.....మనిద్దరం కలగంటున్న గోదారొడ్డున ఆనంద కుటీరం....అబ్బ!!! ఎంత సమ్మోహనపరుస్తుందో!!!
నువ్వూ నేనూ కలిసి పంచుకునే కబుర్ల జలపాతం లో తన్మయమవ్వాలని.....
గోదారొడ్డున మన ఆనంద కుటీరం ఆత్రుతగా ఎదురు చూస్తోంది.

13, అక్టోబర్ 2014, సోమవారం

తల్లిలేదంటారు శివుడికి తల్లిలేదంటారు

తల్లిలేదంటారు శివుడికి తల్లిలేదంటారు
తల్లుంటే జడలు అట్ల కట్టనించేదా? 
తల్లుంటే పులితోలు చుట్టనించేదా?
తల్లుంటే విభూది రాయనించేదా?
తల్లుంటే స్మశానల తిరగనించేదా?
తల్లిలేదంటారు శివుడికి తల్లిలేదంటారు
తల్లిలేని శివుడే అంతటి ఘనుడైతే తల్లున్న శివుడు ఇంకెంతటి ఘనుడవునో!
(ఒక తెలుగు సినిమా కవి రాసింది)

12, అక్టోబర్ 2014, ఆదివారం

రెండు ప్రవాహాల నుంచి కొట్టుకొచ్చిన రెండు కట్టెలు సముద్రంలో కొంత దూరం

** రెండు ప్రవాహాల నుంచి కొట్టుకొచ్చిన రెండు కట్టెలు సముద్రంలో కొంత దూరం కలసి ప్రయాణిస్తాయి.కొంతకాలానికి విడిపోతాయి.అదే మాదిరి భార్య, పుత్రులు, ధనధాన్యాలు, దాయాదులు మనతో కొంతకాలం కలసి ఉంటారు. తరువాత ఎవరితోవన వాళ్ళు పోతారు. ఏ జీవికాజీవి విడివిడిగా ఉండడమే శాశ్వతమైన సత్యం.కలసి ఉండడం తాత్కాలికం.: 

11, అక్టోబర్ 2014, శనివారం

కుళ్ళు రాజకీయాలైనా, ఛాందసపు మతాలైనా,

కుళ్ళు రాజకీయాలైనా, ఛాందసపు మతాలైనా, 
స్ర్తీని బానిసను చేసే సామాజిక విధానాలైనా- 
మందులు ఎక్స్‌పైరీ డేట్‌ తర్వాత ఎలాగైతే విషపూరితమవుతాయో 
విషపూరితమైపోయిన భావాల్ని, విధానాల్ని కూడా మనం ఈ సమాజం నుండి తీసివేయాలి.
_______________________________________కమలా దాస్

చిన్న విత్తనం మొలకెత్తి పెద్ద చెట్టుగా మారేలోగా ఎన్ని అడ్డంకులు అవాంతరాలు

చిన్న విత్తనం మొలకెత్తి పెద్ద చెట్టుగా మారేలోగా ఎన్ని అడ్డంకులు అవాంతరాలు. మొదట విత్తనం మట్టిలో ఉండగానే చీమలూ, పురుగులూ తినేసేయాలని చూస్తాయి.
అది వాటిని తప్పించుకుని మొలకెత్తుతూ ఉంటే పక్షులు దాన్ని పసిగట్టి పొడుస్తూ తినేయాలని చూస్తాయి.
ఆ తరువాత అది పెరుగుతూ ఉంటే పశువులూ దాని పని పట్టబోతాయి.
ఐనా అది ఎదిగి పెద్ద వృక్షంగా మారిందంటే, ఇంతకాలం దాని ఎదుగుదలకు అడ్డంకిగా ఉన్న ఆ జీవులన్నీ దాని నీడలోనే తలదాల్చుకుంటాయి.
మనిషి ఎదుగుదలా సరిగ్గా ఇలాంటిదే.

స్త్రీని గౌరవించలేని సమాజంచిరస్థాయిగా మనుగడ సాగించలేదు:

స్త్రీని గౌరవించలేని సమాజంచిరస్థాయిగా మనుగడ సాగించలేదు: 
--------------------------------------------------- ----------------- 
*యత్ర నార్యన్తు పూజ్యంతే రమన్తే తత్ర దేవతాః!
యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాఫలాః క్రియాః!!
**స్రీలు ఎక్కడ పూజ్యనీయులో దేవతలక్కడ ఆనందంగా విహరిస్తారు. ఎక్కడ స్త్రీలకు గౌరవముండదో అక్కడ పనులన్నీ వ్యర్థమైపోతాయి 
* శోచంతి జామయో యత్ర వినశ్యత్యాశుతత్కులం!
న శోచంతి తు యత్రైతా వర్ధతే తద్ధి సర్వదా!!
**స్త్రీలెక్కడ దుఃఖపడుతుంటారో ఆ కులం త్వరలో నశించిపోతుంది. ఎక్కడ బాధలు లేకుండా సంతోషంగా ఉంటారో ఆ కులం వృద్ధిచెందుతుంది.
*తస్మాదేతాః సదాపూజ్యా భూషణాచ్ఛాదనాశనైః!
భూతికామైర్నరైర్నిత్యం సత్కారేషూత్సవేషు చ!!
**అన్ని పర్వదినాలు, పండుగల్లో అభివృద్ధికి రాదలచినవారు స్త్రీలను నగలు, వస్త్రాలతో, తినుబండారాలతో సంతోషపరచి, గౌరవించాలి!!
(భారతీయ సంస్కృతి-మనువు)

9, అక్టోబర్ 2014, గురువారం

నేనేన్డున్నాను..మ్ర్తతప్రదేసంబునా.. కాదు కాదు .దుర్గంద పంకిల గాడాంధకార బంధు పాతాల పరమహేయా గృహముననే .. అత్యన్తవమాన..అవహేళన..అగౌరవ..అమితాన్దతాపా అమేయ నిన్దావ్యాక్య సంతాప సూచీ యంత్రముననే ...

నేనేన్డున్నాను..మ్ర్తతప్రదేసంబునా.. కాదు కాదు .దుర్గంద పంకిల గాడాంధకార బంధు పాతాల పరమహేయా గృహముననే .. అత్యన్తవమాన..అవహేళన..అగౌరవ..అమితాన్దతాపా అమేయ నిన్దావ్యాక్య సంతాప సూచీ యంత్రముననే ...
ఇస్సిరో నిర్మల నీలాకాసమున నిర్నిద్ర ప్రచండ భానుడు హిమసందోహమున ఇంచుకసేపు సంగతుడు కాడా  పట్టపగలిట్టి నిశావితానమును వేలయిమ్పడా.. ...వైరి వనితా కరతాలధ్వనులా అవి నక్షత్ర రూపమున నన్ను పొంచి పొంచి చూచు చున్నవి..అల్లదే పాండుడు కుమారా పరిహాస చంద్రమా నీవీ రేయికి రేరాజా.. ఈ రారాజును చెలగితివా...
ఆభందకీక్రుత పరిహాసావమానానికి.....సకల కౌరవరాజ్య సార్వభౌమపదవదివసించి.భీష్మ ద్రోణాది కర్ణుని కరంబులు నన్ను కొల్వ...నిఖిల గీర్వాణ నిజజయంబు మదీయ క్రుదా కృటిల బ్రుకిటికై జన్కుచుండ . అంగ వంగ... తృతీయ నేత్రంబునైనకలాన్గమును మూయిమ్పజాలు పెక్కడి విలుకాన్ద్రుండి ,,పెక్కటి పౌరుల అంకుసములైన డీకొని మదగ్ని నిదగ్నముల సమర్పింప సంసిద్దగనుండగ...కురుకుల లలాముడనై ...జగ సహస్ర భానుడనై.బలరామునోద్ద గదాయుద్ధ వైదుష్యము నార్జించి.. సప్త్సాగార వేలావలయుత వసున్దావలయంబున....






దేహా మాపాద మస్తకము మంట లేగయుచున్నావి....నిత్య నిత్యోదయ లాలస మానసమా..!!ఇట్టి విశాలాభిరామభూవలయసాల మందిరమున నీకు క్రీడా మందిరము లభిమ్పదా.... ఇట్టి ఘన సార హరి చందన శీతలాది శీతల కిరనజన్యకాకలాపమందరికాహ్లాదము కలిగించు చుండ నీకు మాత్రము శూన్యమై..శూన్య శోభితమై ప్రస్తుత కాలమాన సమస్త దాశీద దిసాదసము కీలహరణ వేధనమై  .. క్షణమునకొక అకాల మరణము కల్పించుచున్నదా...
ఈ సంతాపము ప్రానాపహరణ తాపము.. ప్రానపహరణ తాపమీ సంతాపము..
అతి ఘోరే ప్రలయార్క తాప శత విధ్యుత్ ప్రదీప్త చ్యుతి కించిత్ స్పురి తాపమును నేనెట్లు ఆనంద మారండ విందు సందోహంబున యెద వహింతు...
 ఏమి కర్తవ్యము...మనుటయా మరణించుటయా..




మాయమైపోతున్నదమ్మ ..మనిషన్నవాడూ.

మాయమైపోతున్నదమ్మ ..మనిషన్నవాడూ.
మచ్చుకైనలేదు చూడు మానవత్వము ఉన్నవాడూ
నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు ఏడ ఉన్నదో కాని కంటికీ కానరాడు..... "మా"

నిలువెత్తు స్వార్ధము నీడలా వెంటుంటే చెడిపోక ఎమవుతడమ్మా...
ఆత్మీయ భందాలు ప్రేమ సంభందాల దిగజారుతున్నదో యమ్మా
అవినీతి పెను ఆశ అందకారములోన చిక్కుకొని నరుడు శిదిలమవుతున్నాడు

 రాల్లరప్పల దైవరూపాలుగాకోలచు పంది నంది ని చూసి పది మొక్కుతుంటాడు
చీమలకు చెక్కెర పాములకు పాలోసి జీవకారున్యమే జీవనము అంటాడు
సాటి మనిషికి కాస్థాసాయంబు నీయకా కులమంటూ ఇల మీద కలహాలగిరిగీసి

ఆధ్యాత్మికతకున్న  అర్ధమే తెలియకా ఆంధ్దయిపోతున్నడంమా
హిందూ. మిస్లిము, క్రీస్తు, సిక్కు ,పారసీ లంటూ తనను తా మరిచేనోయమ్మా
మతము లోకహితము అన్న మాటను మరచి.. మత ఘర్శనలమద్య మనిషి కనుమరుగవుతూ ..."మా"

ఇరువయీదుపైసల లగారువత్తులు కాల్చి అరువైఇదుకొత్ల వారము లడుగుతాడు
దైవాలపెరుతో చందాల కై దండా .బక్తి ముసుగుగులో భల ఫోజు కొడతాడు '
ముక్తి పేరిట నరుడు రక్తి లో రానిల్లి  ... రాకాసి రూపాన రంజిల్లు లోకాన ...   "మా"

అవసరాలకు మనిషి సృష్టించి రూపాయి   చుట్టుతిరుగుతున్నదమ్మా
రూపాయి కొరకు ఏ పాపానికైతేమి వదిగట్టేనదిగొ చూడమ్మా
కూటికోరకు కోటివిద్యలన్నది పోయి.. కోట్లకు పడగెత్త కోరికలు సెలరేగి.... "మా"

కల్లపోరలు  కమ్మి కామము తో రేగి వెకిలి చేష్టలతో వేదిస్తువుంటాడు
పసికండులతో రసికత్వమునుకోరి పచ్చి పాపానికే పాల్పడుతుంటాడు
కంచే చేనుమేయు చందంబునా నరుడు... ఆమ్మ జన్మకే నేడు ఆపదయి కూకుండు..."మా"

డాలర్ల మోజుతో డాబుసరి బతుకుకయి... అమెరికా నౌకరీ వెలగబెడుతుంటాడు
కాలధర్మం అయిన కన్నవారిని నేడు... కంపూటర్లో చూసి ఖర్మకాండలే చేస్తూ..."మా"

పార్టీల పడగలా గోడుగులనీడలో బతుకు గడుపుతున్నడమ్మా
ఆదిపత్యపుపోరు అలజడే చిరునామా అంటూ జై కొడుతున్నడమ్మా
రాజకీయాలలో రాటు తేలీ తుదకు.. మానవా విలువల్ని మంటకలుపూకుంటూ..."మా"

ఇనుపరేక్కలడేగ విసిరినా పంజాకు కోడిపిల్లయిచిక్కి కొట్టుకోనుచున్నాడు
వుట్టికీ స్వర్గానికంధకుండా తుదకు అస్తిపంజరమయ్యి అగుపిస్తువున్నాడు
కదేలే విశ్వము తన కనుసన్నలలో ననీ కనుబోమ్మలేగరేసి కాలగర్భములోన...."మా"






అద్భుతాలు చేసినవారందరూ ఆకాశంనుండి పుట్టలేదు.అమ్మ కడుపునుండి పుట్టినోల్లె అహర్నిశలు స్రమించినోల్లె...

2, అక్టోబర్ 2014, గురువారం

.నేను ముగురమ్మలను చూడాలి ఎలా?.....సాధ్యమా? తప్పక?


.
నేను ముగురమ్మలను చూడాలి ఎలా?.....సాధ్యమా? తప్పక?
తల్లి ఒడి మొదటి బడి..అందుకే ఆమె నా సరస్వతి....
తల్లి ఎద ప్రధమ శక్తి, అందుకే ఆమె
నా దుర్గమ్మ....
తల్లి నా సంపద, అందుకే ఆమె నా ఆదిలక్ష్మి....
నా తల్లిని చూసిన నాకు,
ఆమె కళ్ళు
ప్రేమ వాకిళ్ళు , ముగురమ్మల లోగిళ్ళు