27, డిసెంబర్ 2017, బుధవారం

ఎక్కడ
నా తెలుగుదనం?
..

ఎర్రటి కుంకుమ దిద్దిన
ముఖాన్ని చూశారా?
ఎవరైనా!
బొట్టుబిళ్ళలో
బోసి ముఖాలో తప్ప!

....

లంగా వోణీ వేసిన
రెండు జెళ్ళ సీత
తెలుగమ్మాయి ఏది?
...

ఆవిరి కుడుము,
తప్పాలచెక్క,
అరిశ ముక్క
ఏవీ మన వంటింట్లో ?
ప్లేట్ లో పిజ్జాలు
నోట్లో నూడుల్సు తప్ప!
...

ఒక్కొక్క ఇంట్లో
ఒక్కో రకం
ఆవకాయ రుచి
ఇప్పుడు
అందరి ఇళ్ళల్లో
ఒకటే రుచి
అది ప్రియనో
ఇంకెవరి క్రియనో ..

...

నమస్కారం
తిరస్కారానికి
గురి అయ్యింది !
హల్లో హాయ్ !
హౌ ఆర్ యు ..డూడ్ !
పురస్కారం అందుకుంటున్నాయి ..
....

 మామ
 బాబాయి
 పెద్దనాన్న
అందరు అంకుల్సే ..
...

పిన్ని
అత్త
పెద్దమ్మ
అందరు
ఆంటీలే...
...

వదిన
బావ
బావమరిది
అందరు కజిన్సే ...
...

పలకరింతలు
పులకరింతలు
పలవరింతలు
రచ్చబండా
రాములోరి గుడి
అన్ని
ఇంటర్నెటే..

...

చల్లని గాలి
తియ్యని నీళ్ళు
గోదారి గంగమ్మ
కోనసీమ కొబ్బరిముక్క
ఎక్కడ నా ఉనికి?
...

మనం
తెలుగు వాళ్ళమా ?!
ఎక్కడ తెలుగుదనం ????

😞😞😞😞😞😞
.
Dr Sandhya Kamalesh Kulakarni gaari WhatsApp message

19, అక్టోబర్ 2017, గురువారం

జటాటవీ గలజ్జలప్రవాహపావితస్థలే

జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే
గలేవలమ్బ్య లమ్బితాం భుజఙ్గతుఙ్గమాలికామ్ |
డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం
చకార చణ్డతాణ్డవం తనోతు నః శివః శివమ్ ||

జటాకటాహసమ్భ్రమభ్రమన్నిలిమ్పనిర్ఝరీ-
-విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని |
ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకే
కిశోరచన్ద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ ||

ధరాధరేన్ద్రనన్దినీవిలాసబన్ధుబన్ధుర
స్ఫురద్దిగన్తసన్తతిప్రమోదమానమానసే |
కృపాకటాక్షధోరణీనిరుద్ధదుర్ధరాపది
క్వచిద్దిగమ్బరే మనో వినోదమేతు వస్తుని ||

జటాభుజఙ్గపిఙ్గళస్ఫురత్ఫణామణిప్రభా
కదమ్బకుఙ్కుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే |
మదాన్ధసిన్ధురస్ఫురత్త్వగుత్తరీయమేదురే
మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి ||

సహస్రలోచనప్రభృత్యశేషలేఖశేఖర
ప్రసూనధూళిధోరణీ విధూసరాఙ్ఘ్రిపీఠభూః |
భుజఙ్గరాజమాలయా నిబద్ధజాటజూటక
శ్రియై చిరాయ జాయతాం చకోరబన్ధుశేఖరః ||

లలాటచత్వరజ్వలద్ధనఞ్జయస్ఫులిఙ్గభా-
-నిపీతపఞ్చసాయకం నమన్నిలిమ్పనాయకమ్ |
సుధామయూఖలేఖయా విరాజమానశేఖరం
మహాకపాలిసమ్పదేశిరోజటాలమస్తు నః ||

కరాలఫాలపట్టికాధగద్ధగద్ధగజ్జ్వల-
ద్ధనఞ్జయాధరీకృతప్రచణ్డపఞ్చసాయకే |
ధరాధరేన్ద్రనన్దినీకుచాగ్రచిత్రపత్రక-
-ప్రకల్పనైకశిల్పిని త్రిలోచనే మతిర్మమ ||

నవీనమేఘమణ్డలీ నిరుద్ధదుర్ధరస్ఫురత్-
కుహూనిశీథినీతమః ప్రబన్ధబన్ధుకన్ధరః |
నిలిమ్పనిర్ఝరీధరస్తనోతు కృత్తిసిన్ధురః
కళానిధానబన్ధురః శ్రియం జగద్ధురన్ధరః ||

ప్రఫుల్లనీలపఙ్కజప్రపఞ్చకాలిమప్రభా-
-విలమ్బికణ్ఠకన్దలీరుచిప్రబద్ధకన్ధరమ్ |
స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం
గజచ్ఛిదాన్ధకచ్ఛిదం తమన్తకచ్ఛిదం భజే ||

అగర్వసర్వమఙ్గళాకళాకదమ్బమఞ్జరీ
రసప్రవాహమాధురీ విజృమ్భణామధువ్రతమ్ |
స్మరాన్తకం పురాన్తకం భవాన్తకం మఖాన్తకం
గజాన్తకాన్ధకాన్తకం తమన్తకాన్తకం భజే ||

జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజఙ్గమశ్వస-
-ద్వినిర్గమత్క్రమస్ఫురత్కరాలఫాలహవ్యవాట్ |
ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్మృదఙ్గతుఙ్గమఙ్గళ
ధ్వనిక్రమప్రవర్తిత ప్రచణ్డతాణ్డవః శివః ||

దృషద్విచిత్రతల్పయోర్భుజఙ్గమౌక్తికస్రజోర్-
-గరిష్ఠరత్నలోష్ఠయోః సుహృద్విపక్షపక్షయోః |
తృష్ణారవిన్దచక్షుషోః ప్రజామహీమహేన్ద్రయోః
సమం ప్రవర్తయన్మనః కదా సదాశివం భజే ||

కదా నిలిమ్పనిర్ఝరీనికుఞ్జకోటరే వసన్
విముక్తదుర్మతిః సదా శిరఃస్థమఞ్జలిం వహన్ |
విముక్తలోలలోచనో లలాటఫాలలగ్నకః
శివేతి మన్త్రముచ్చరన్ సదా సుఖీ భవామ్యహమ్ ||

ఇమం హి నిత్యమేవముక్తముత్తమోత్తమం స్తవం
పఠన్స్మరన్బ్రువన్నరో విశుద్ధిమేతిసన్తతమ్ |
హరే గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథా గతిం
విమోహనం హి దేహినాం సుశఙ్కరస్య చిన్తనమ్ ||  |

పూజావసానసమయే దశవక్త్రగీతం యః
శమ్భుపూజనపరం పఠతి ప్రదోషే |
తస్య స్థిరాం రథగజేన్ద్రతురఙ్గయుక్తాం
లక్ష్మీం సదైవ సుముఖిం ప్రదదాతి శమ్భుః ||

18, సెప్టెంబర్ 2017, సోమవారం

నీతి నియతిలేని నీచుని చేతిలో

మరి తెలుగుపత్రికలకు మార్గదర్శకునిగా వెలుగొందిన నార్ల వారు 1956 కు ముందే..
నీతి నియతిలేని నీచుని చేతిలో
పత్రికుండెనేని ప్రజకు చేటు;
హంత చేతికత్తి గొంతుకలు కోయదా?
నవయుగాల బాట నార్ల మాట!

ఆయనే..
పత్రికా రచనను పడపు వృత్తిగ మార్చు
వెధవకంటె పచ్చి వేశ్య మేలు;
తనువు నమ్ము వేశ్య, మనసును కాదురా
నవయుగాల బాట నార్ల మాట!...
అని కూడా అన్నారు

మరి పత్రికలకు కిరీటాలు పెట్టి కౌగలించుకుందామా!!

2, సెప్టెంబర్ 2017, శనివారం

బట్టతల సౌఖ్యం

బట్టతల సౌఖ్యముల గురించి...
*తలనూనె రాసెడు తగులాటముండదు-*
*క్షౌరశాలకు వెళ్ళు కర్మ లేదు/*
*పేలు కొంపలు గట్టు పెనుబాధ తప్పును-*
*చుండ్రు బాధలు తప్పి సుఖము గల్గు/*
*పెళ్ళాము కోపాన పెనుగులాడెడు వేళ-*
*జుట్టింత దొరకదు పట్టుకొనగ/*
*అద్దంబు దువ్వెన లవసరమే లేదు-*
*పర వనితలు వెంటబడుట కల్ల/*
తేటగీతి.
*కడకు కుంకుడు, శీకాయ ఖర్చు మిగులు/*
*తలకు స్నానంబు చేయుట సులభమౌను/*
*ఇన్ని గణనీయ లాభంబు లెంచి చూడ/*
*బట్టతల గల్గు వాడె పో భాగ్యశాలి.*

2, జులై 2017, ఆదివారం

భారతదేశ ప్రశస్తి

గ్రీకు తత్వవేత్త అరిస్టాల్... alexaander గురువు..
భారత దేశ పిడికెడు మట్టి...గంగ నీరు...రామాయణ గ్రంధం..మహాభారత గ్రంధం..ఆధ్యాత్మిక గురువు...బహుమతిగా తెమ్మన్నారు...
 అమెరికా monument... statue of liberty... ఈజిప్టు monument... పిరమిడ్లు...దానిలో ముమ్మీలు ఉంటాయి...మనభారతదేశానికి సి నా రె ఉవాచ..
నాదేశం.భగవద్గీత...నాదేశం అగ్ని పునీత సీత...నాదేశం..కరుణాంతరంగ...నాదేశం..సంస్కార గంగ...
వాజపేయి కవిత్వం
మచ్చలేని చందమామ నా భరథసీమ ..ఫలియించిన సత్కర్మ నా ఈ దేశపు జన్మ
ఈ దేశంలో...ఈ నాదేహతో జీవించటమే నా అదృష్టం..మళ్లీ జన్మాంతుంటే ..అది ఈ దేశంలోనే అంటే ఇపుడే మరణించటమే నాకిష్టం...

27, జూన్ 2017, మంగళవారం

తెలుగేక్కడుందిరా..తెలుగోడా...

తెలుగెక్కడుందిరా తెలుగోడా...?
నీ తెలుగు తెల్లారె తెలుగోడా...!

తెలుగు పేరూ చెప్పి అధికారమెక్కారు
తెలుగు భాషను వీళ్ళు తుంగలో తొక్కారు!
బడులలోన తెలుగు బంద్ అయితోందిరా
తెలుగోడి గొంతెపుడో మూగపోయిందిరా!

ఎంగిలీ భాషలకు ఊడిగం చేస్తారు
పరభాష పదాలకు పట్టమే కడతారు!
పదము పలకరానోళ్ళు పదవులెక్కేస్తారు
జీవోలు పాస్ చేసి తెలుగు చంపేస్తారు!

తెలుగెక్కడుందిరా తెలుగోడా...?
నీ తెలుగు తెల్లారె తెలుగోడా...!

తెలివిక్కడుందిరా తెలుగోడా
తల్లినే రక్షించు మొనగాడా

పెనునిద్దురొదలరా పంచె బిగకట్టరా
పోరుబాటా పట్టి ఊరుఊరూ తిరిగి
అన్నతమ్ములకలసి అక్కచెల్లెలపిలిచి
తల్లిభాషాగోడు తెలియచెప్పుచు మనము


బేధభావాలొదిలి భేషజాలకుపోక
అమ్మఋణమూతీర్చ అందరమ్మొక్కటై
ఓటుఈటెనుతీసి పోటుపొడవాలిరా
తలపొగరునాయకుల దిమ్మతిరగాలిరా

తెలివిక్కడుందిరా తెలుగోడా
తల్లినే రక్షించు మొనగాడా

తెలుగు భాషాభిమాని
వామరాజు సత్యమూర్తి

2017-06-27 18:20 GMT+05:30 Andukuri Sastry <acpsastry@gmail.com>:
నేను మాస్నేహితుడు  మూర్తి గారికి చైతన్య ప్రసాద్ గారి వివరాలు అడిగాను.ఆయన ఇచ్చిన వివరాలతో నాకు మతిపోయింది.ఈ చైతన్య ప్రసాద్ గారు చాలా పెద్దవాడట సినిమా లింక్స ఉన్నయ్యిట. ఆలింకు క్రింద ఇస్తున్నాను.
అతనితో మాట్లాడే వయసు కాదు మాది.
ఎవరికైనా interest,ఉంటే ఈ లింక్ ను సంప్రదించగలరు

చాలామంది కవిత బాగుందని నాకు చెప్పటం వలన. ..అ ఖ్యాతి నాది కాదు ...
చైతన్యప్రసాద్ ది కనుక లింకు ఇస్తున్నాను
Chaitanyaprasad google uk.

https://www.google.co.uk/search?client=ms-android-samsung&ei=NzlSWZfpKYL6wALSorOwAg&q=chaitanya+prasad+lyricist&oq=chaitanya+prasad+lyricis&gs_l=mobile-gws-serp.1.1.41j0i67k1j0j0i22i30k1.257.1665.0.3164.7.6.0.0.0.0.267.1178.0j3j3.6.0.ernk_qsds...0...1.1j4.64.mobile-gws-serp..5.2.493._o1BSKa1oAQ

.

27, మే 2017, శనివారం

ఏదేశమేగినా..యెనుకాలిడినా

ఆంధ్రావళి - రాయప్రోలు సుబ్బారావు

3. జన్మభూమి
ఏ దేశ మేగినా, ఎందుకాలిడిన,
ఏ పీఠ మెక్కినా, ఎవ్వ రేమనిన,
పొగడరా నీతల్లి భూమి భారతిని,
నిలుపరా నీ జాతి నిండు గౌరవము.

ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగబలమొ,
జనియించినాడ వీ స్వర్గ ఖండమున;
ఏ మంచి పూవులన్‌ ప్రేమించినావొ,
నిను మోచె ఈ తల్లి కనకగర్భమున.

లేదురా ఇటువంటి భూదేవి యెందు,
లేరురా మనవంటి పౌరు లింకెందు.
సూర్యుని వెలుతురుల్‌ సోకునందాక,
ఓడల జండాలు ఆడునందాక,
అందాక గల ఈ యనంత భూతలిని
మన భూమివంటి చల్లని తల్లి లేదు;
పాడరా నీ తెన్గు బాల గీతములు
పాడరా నీ వీరభావ భారతము

తమ తపస్సులు ఋషుల్‌ ధారపోయంగ,
శౌర్యహారము రాజచంద్రు లర్పింప,
భావసూత్రము కవిప్రభువు లల్లంగ,
రాగదుగ్ధము భక్తరత్నముల్‌ పిదుక,
దిక్కుల కెగదన్ను తేజమ్ము వెలుగ,
రాళ్ళ తేనియ లూరు రాగాలు సాగ,
జగముల నూగించు మగతనం బెగయ,
సౌందర్య మెగబోయు సాహిత్య మలర,
వెలిగినదీ దివ్యవిశ్వంబు పుత్ర!
దీపించెనీ పుణ్యదేశంబు పుత్ర!

పొలముల రత్నాలు మొలిచెరా యిచట,
వార్ధిలో ముత్యాలు పండెరా యిచట,
పృథివి దివ్యౌషధుల్‌ పిదికెరా మనకు,
కానల కస్తూరి కాచెరా మనకు,
అవమాన మేలరా! అనుమాన మేల
భారతీయుడనంచు భక్తితోపాడ.

24, మే 2017, బుధవారం

పలుపలు వరములు జనులకు

పలుపలు వరములు జనులుకు
గలుపుదుమనుచును గలగల గడు కపటములన్
బలుకుచు గెలుపుల కలలలొ
గులుకుచు గదిలె డల శునక గణిక కొడుకుల గనుమా!

14, మే 2017, ఆదివారం

ఎవరు రాయగలరూ..అమ్మా యను

Happy Mother's Day !!

ఎవరు  రాయగలరు  అమ్మా  అను మాట కన్న కమ్మని  కావ్యం

ఎవరు  పాడగలరు  అమ్మా  అను రాగం కన్న తియ్యని రాగం
అమ్మేగా...  అమ్మేగా తొలిపలుకు  నేర్చుకున్న  భాషకి
అమ్మేగా  ఆదిస్వరం  ప్రాణమనే  పాటకి                
ఎవరు  రాయగలరు  అమ్మా  అను మాట కన్న కమ్మని  కావ్యం
ఎవరు  పాడగలరు  అమ్మా  అను రాగం కన్న తియ్యని రాగం

అవతారమూర్తి  అయినా  అనువంతే పుడతాడు
అమ్మపేగు   పంచుకునే  అంతవాడు  అవుతాడు  [ 2 ]
అమ్మేగా... అమ్మేగా  చిరునామా  ఎంతటి  ఘనచరితకి
అమ్మేగా  కనగలదు  అంతగొప్ప అమ్మని                  
ఎవరు  రాయగలరు  అమ్మా  అను మాట కన్న కమ్మని  కావ్యం
ఎవరు  పాడగలరు  అమ్మా  అను రాగం కన్న తియ్యని రాగం  

శ్రీరామరక్ష  అంటూ.. నీళ్ళుపోసి పెంచింది
ధీర్గాయురస్తు  అంటూ.. నిత్యం  దివించింది        [ 2 ]
నూరేళ్ళు ....నూరేళ్ళు  ఎదిగి  బ్రతుకు  అమ్మ  చేతి  నీళ్ళతో
నడక  నేర్చుకుంది  బ్రతుకు  అమ్మచేతి  వేళ్ళతో        
ఎవరు  రాయగలరు  అమ్మా  అను మాట కన్న కమ్మని  కావ్యం
ఎవరు  పాడగలరు  అమ్మా  అను రాగం కన్న తియ్యని రాగం
అమ్మేగా తొలిపలుకు  నేర్చుకున్న  భాషకి
అమ్మేగా  ఆదిస్వరం  ప్రాణమనే  పాటకి                
ఎవరు  రాయగలరు  అమ్మా  అను మాట కన్న కమ్మని  కావ్యం
ఎవరు  పాడగలరు  అమ్మా  అను రాగం కన్న తియ్యని రాగం

చనుబాలు  తాగితేనే  బ్రతుకు  తీపి  తెలిసింది
ఆరురుచులు  తగలగానే  అమ్మే  చేదవుతుంది      [ 2 ]
రోమ్మేగా ... రోమ్మేగా  అందించెను  జీవితాన్ని  నోటికి
అమ్మేగా  తన నెత్తురు  నింపెను  నీ  ఒంటికి            
ఎవరు  రాయగలరు  అమ్మా  అను మాట కన్న కమ్మని  కావ్యం
ఎవరు  పాడగలరు  అమ్మా  అను రాగంలా  తియ్యని రాగం

ఆలైన బిడ్డలైన  ఒకరు  పొతే  ఇంకొకరు
అమ్మా  పదవి  ఖాలీ  అయినా  అమ్మా  అవరు  ఇంకెవరు    [ 2 ]
అమ్మంటే ...అమ్మంటే  విరమించని  వట్టి  వెట్టి  చాకిరీ
అమ్మంటే  రాజీనామా  ఎరగని  ఒక  నౌకరి
ఎవరు  రాయగలరు  అమ్మా  అను మాట కన్న కమ్మని  కావ్యం
ఎవరు  పాడగలరు  అమ్మా  అను రాగంలా  తియ్యని రాగం

9, మే 2017, మంగళవారం

దనవీరసూరకర్ణ డైలాగ్స్

దాన వీర శూర కర్ణ డైలాగుల

ఆగాగు !

ఆచార్య దేవ, హహహ!  ఏమంటివి?  ఏమంటివి ?

జాతి నెపమున సూత సుతునకిందు నిలువ అర్హత లేదందువా !

ఎంత మాట,  ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ  పరీక్ష కాదే ?

కాదూ  కాకూడదు ఇది కులపరీక్షయే అందువా

నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది ? అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది ?

మట్టి కుండలో పుట్టితివికదా ! హహహ  నీది ఏ కులము?

ఇంతయేల, అస్మతపితామహుడు కురుకుల వృధుడు అయిన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యయౌ గంగా గర్భమున జనియిన్చలేదా  ! హహహ   ఈయనదే కులము  ?

నాతోనే చెప్పింతువేమయ్య  , మా వంశమునకు మూలపురుషుడైన వశిష్టుడు దేవవేశ్యయగు ఊర్వశీ  పుత్రుడు కాదా ?

ఆతడు పంచామజాతి కన్యయగు  అరుంధతియందు శక్తిని,                               ఆశక్తి చండాలాంగనయందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచు మత్యగంధియందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు  విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని , పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును , మా ఇంటిదాసితో ధర్మనిర్మానజనుడని మీచే కీర్తింపబడుచున్న,  హ,                           ఈ విదురదేవుని కనలేదా?

సందర్భావసరములనుబట్టి  క్షేత్రభీజప్రాదాన్యములతో  సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది, కాగ, నేడు కులము కులము అను వ్యర్ధవాదములెందుకు.

ఊం.. ఉ..  హహహ

విరాగియైన పాండురాజుకు సరాగినియై కులప్రవర్తనాసక్తయైన కుంతికి జనియించిన పాండవులు !

ఆబాల్యము ఆటపాటలలో మమ్ము అలమటపెట్టిన పాండవులు !

లాక్కాగృహమును నిశీధిన నిట్టనిలువునా ధహించివేసారన్న నీలాపనిందను మామీద వేసిన పాండవులు !

ఏకచక్రపురములో విప్రవేషములతో ఇల్లిల్లు తిరిపమెత్తి పలుకు వళ్ళుమెక్కు పాండవులు !

అంతకుతగ్గగంతగా అతుకులబొంతగా ఐదుగురు ఒకే కాంతను పరిణయమాడిన పాండవులు !

స్నాయుతాసంకల్పశల్యమున సంప్రాప్తించిన సుంకంమ్మన్నటుల

మా పిత్రుదేవదయాలభ్ధమైన ఇంద్రప్రస్థ వైభవముతో    నేడీ యాగకార్యదుర్వహుగులగుటయా !

నరకలోకముననున్న తమ తండ్రిని యమలోకమునుండి స్వర్గలోకమునకు

జేర్చుట దీని ఆంతర్యమట ! ఏమి కల్పనాచాతుర్యము ? ఏమి కల్పనాచాతుర్యము ?

ఐనను కుంతీ మూలమున స్వర్గనరకాధిపతులిరవురును  పాండురాజునకు తమ్ములేగదా !

ఇందు జరుగనిదేమి ? లోపమేమి ?

అయ్యారే ! సకలరాజన్యులోకమూ సోహోనినాదములు సలుప భారతభారతీ శుభాస్సీసులతో పరిపాలనసాగించెడి మాకు మారాటుగా సార్వభౌమత్వమును సాదింపగోరి  పాండవుల దుష్ప్రయత్నమా ఇది !

సాటిరాజులలో రారాజు కావలెననెడి  ధర్మజుని దుష్టంతమా ఇది !

ఐన కుతంత్రముతో కుచ్చితబుద్ధితో  సేయనెంచిన ఈ యాగము సాగరాదు,  మేమేగరాదు.

అహొ !

అమ్లానభావసంభావితమైన  ఈ దివ్యప్రసూనమాలికారాజమును కురుసింహుని గళసీమనలనలంకరించిన వారెవ్వరు ? అ.. హహహ ..

అనిమిషయామినీ  అథిధిసత్కార  దివ్యసేవాప్రభావమౌనా ! ఔ,, ఔ,,

ఆ.. హహ్హహ,,

ఓ..

ఆ.. ఏమా సుమధుర సుస్వరము !

కాకలీకలకంటికంటి  కూకూఉకారసుతిహిత దివ్యసురకామినీ కామినీయక సుస్వాగతమౌనా ! హాహ్హహ.. అహా .

సొబగు సొబగు.. సొబగు సొబగు..

ఔరా.. ఇది శాస్త్రవిజ్ఞాన ప్రభావమా ! హాహ్హహ..

ఔ.. ఔ..

అయ్యారే !

భ్రమ.. ఇదినా భ్రమ ..

కించిత్ మధుపానాసక్తమైన మా చిత్త భ్రమ..

భళా !

సముచితసత్కారస్వీకారసంత్రుప్తస్వాంతుడనగు ఈ కురుభూకాంతుని సంభావనాసంభాషణాభూషణములచే  ఈ సభాభవనము ధన్యము..ధన్యము..

అకుంచితనిర్మాణచాతురీదుర్యుడవగు ఓ మయబ్రహ్మా.. నీ శిల్పచాతురీమధురిమ ఆ బ్రహ్మకుగాని విశ్వబ్రహ్మకుగాని   లేదు.. లేదు.. లేదు ..

ఆ.. లేవచ్చును, లేకపోవచ్చును.. కాని పాండవహతకులకిట్టి పరిషత్తు లభించుటమాత్రం మానధనులమైన మాబోంట్లకు దుస్సహము.

విశ్వవిశ్వంబరావినుతశాశ్వతమహైశ్వరీమహైశ్వరులము కావచ్చు..

అఖిల నదీనదసాగరవారిదర్గర భూకృత అనఘ్రముక్తామణీమ్రాతమ్ములు మాకుండిన ఉండవచ్చు..

సాగరమేఘరాసతీకరగ్రహణంబోనర్చి సార్వభౌమత్వమందిన అందవచ్చు..

కాని ఇట్టి సభాభవనము  మాకు లేకపోవుట మోపలేని లోపము.

చతుర్కృతాపచారములకంటే శత్రు వైభవము శక్తిమంతుల హృదయములకు దావాలనసధృశము. ఇక మేమిందుండరాదు.

ఏమీ ! నిరాఘాటపదట్టనకు నాకీ కవాటఘట్టనమా ! పరులేవ్వరు లేరుకదా ! మా భంగాపాటును పరికించలేదుకదా ! ఇస్సీ! ఈమయసభను మాకు విడిదిపట్టుగా పెట్టుట

నిస్సందేహముగా ఆ పాండవ హతకులు మమ్ము అవమానిచుటకే.

ఆ.. ఏమీ ! సభాభవన గర్భమున సుందర జలచరసంతియైన  జలాశయమా ! ఆహ్

అంతయు మయామోహితముగా ఉన్నదే !

ఉ.. అహ్హహ్హ.. ఇదియును అట్టిదియే.. అహహ్హహ…

పాంచాలీ… పంచభర్త్రుక …

వదరుపోతా.. వాయునందనా …

పాంచాలి..  పంచభర్త్రుక..  ఏమే.. ఎమేమే..  నీ ఉన్మత్తవికటాట్టహాసము  ఎంత మరువయత్నించినను మరపునకురాక హృదయ శల్యాభిమానములైన నీ పరిహాసారవములే నాకర్ణపుటములను వ్రయ్యలు చేయుచున్నవె.

అహొ   ! క్షీరావారాసిజనితరాకాసుధాకర వరవంశసముత్పన్నమహొత్తమ క్షత్రియ పరిపాలిత భరతసామ్రాజ్యదౌరేయుండనై …

నిజభుజ వీర్య ప్రకంపిత చతుర్దశభువన శూరవరేన్యులగు శతసోదరులకు అగ్రజుండనై …

పరమేశ్వర పాదాభరిత పరశురామ సద్గురుప్రాప్త శస్త్రాత్రవిద్యాపారియుండైన రాధేయునకు మిత్రుండనై.. మానధనుడనై  మనుగడ సాగించు నన్ను చూచి ఒక్క ఆడుది పరిచారికా పరీవృతయై పగులబడి నవ్వుటయా ?

అహొ ! తన పతులతో తుల్యుడనగు నను భావగా  సంభావింపక, సమ్మానింపక.. గృహిణిధర్మ పరిగ్దగ్ధయై.. లజ్జావిముక్తయై.. ఆ పంతకి పాంచాలి ఎట్టఎదుట యేల గేలి సేయవలె ?

అవునులే.. ఆ బైసిమాలిన భామకు ఎగ్గేమి ? సిగ్గేమి ? వొంతువొంతున  మగలముందొక మగనిని వచ్చనపర్యంతము  రెచ్చిన కడుపిచ్చితో పచ్చిపచ్చి  వైభవమున తేలించు ఆలి గేలి సేసిన మాత్రమున హహ.. హహ మేమేల కటకట పడవలే ?  ఊరకుక్క ఉచితానుచిత జ్ఞానముతో మోరెత్తి కూతలిడునా !  ఆ.. అని సరిపెట్టుకొందున ! ఈ లోకమును మూయ మూకుడుండునా !

దుర్వ్యాజమున   సాగించు యాగమని తెలిసి మేమేల  రావలె … వచ్చితిమి పో !

నిజరత్నప్రభాసమపేతమై సర్వర్త్రు సంశోభితమైన ఆ మయసభాభవనము మాకేల విడిది కావలె.. అయినది పో !

అందు చిత్రచిత్ర విచిత్ర లావణ్య లహరులలో ఈదులాడు విద్రుక్షాపేక్ష మాకేల కలుగవలె …  కలిగినది  పో !

సజీవ జలచర సంతాలవితాలములకు ఆలవాలమగు ఆ జలాశాయములో మేమల కాలు మోపవలె .. మోపితిమి పో !

సకల రాజన్యుకోటీరకోటిసంక్షిప్త రత్నప్రభా నీరాజితంబగు మాపాదపద్మమేల అపభ్రమనం  చెందవలె..  ఏకత్సమయమునకే  పరిచారికాపరీవృతయై  ఆపాంచాలి  యేల రావలె..వీక్షించవలె.. పరిహసించవలె ?

ఆ విధి.. హా విధి.. హా హతవిధీ..

ఆజన్మ శత్రువులేయని అనుమానించుచునే అరుదెంచిన మమ్ము అవమాన బడబానలా జ్వాలలు  ధగ్ధమోనర్చుచున్నవి మామా..

విముఖునిసుముఖునిజేసి మమ్మితకు విజయముసేయించిన నీ విజ్ఞాన విశేష విభావాదిత్యములు ఏమైనవి మామా ?

పాంచాలీ కృతావమాన మానసుడనై, మానాభిమానవర్జితుడనై మర్యాదాతిక్రమనముగా మనుటయా.. లేక పరిహాసపాత్రమైన ఈ బ్రతుకోపలేక మరణించుటయా..

ఇస్సీ.. ఆడుదానిపై పగసాదింపలేక ఆశు పరిత్యాగము గావించినాడన్న అపఖ్యాతి ఆపైన వేరొకటియా…


  • ఇప్పుడేదీ కర్తవ్యము ?  మనుటయా? మరణించుటయా ?

అమ్మలగన్న యమ్మ ముగ్గురమ్మల

అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె
 ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లో
 నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మా యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్ _ Idi oka  amm a pad yam yeh

2, మే 2017, మంగళవారం

కలమెత్తిన హలమెత్తిన
మలమెత్తినవారి నొక్కమై జూడవలెన్
వలతియు నలతియు లేదిట
బలు వృత్తులు సాగినపుడె బ్రతుకులు సాగున్‌!’

అని ‘తెలుగులెంక’ తుమ్మల వారి ఆకాంక్ష నీరుగారి పోయిందే ఈనాడు !!

27, ఏప్రిల్ 2017, గురువారం

...ఆధునిక పోకడ.....

ఆధునికత పేరుతో
అవకతవక జ్ఞానంతో
ఆడంబరాలకై అర్రులు చాస్తూ
ఆపదల పాలైపోతున్న నేటి యువత...

చాలీ చాలని వస్ర్రాలే
సంస్కారమని భ్రమిస్తూ
చదువులున్నా తెలివి కొరవడి
దేహాన్ని చూపిస్తూ మోహాలను పెంచేస్తూ
దగా పడ్డామని వాపోతూనే
దారుణాలని ప్రోత్సహిస్తూ
 పెడదోవన నడుస్తున్న
కలికాలపు కాంతలు....

పట్టు పావడాలు రంగురంగుల ఓణీలు
జడకుచ్చుల అందాలు
మల్లెపూల అలంకారాలు
మచ్చుకైనా కానరాక
మగువనొ మగవాడో
గుర్తించలేని రీతిలో
ఆరు బయట సంచరిస్తుంటే
కళ్ళున్నా చూడలేని  కన్నవాళ్ళ గారాబం
కోట్లిచ్చినా కొనలేని తెలుగుతనపు
సాంప్రదాయం కానరాని దృష్యమై
కంటశోష మిగులుస్తోంది...

అసభ్యతను మోస్తూ
అవమానాలపాలవుతూ
విదేశీ మోజులో
స్వాభిమానం వదిలేస్తూ
వంచనలకు లోనై చింతించే కన్నా
తెలివితేటలూ శక్తియుక్తులే
నిజమైన అందాలని గ్రహించి
మేలుకొనుట ఉత్తమం
చాటి చెప్పుట మన ధర్మం.....!!

    అనుశ్రీ....

26, ఏప్రిల్ 2017, బుధవారం

కన్నడ కంటీరవ రాజ్ కుమార్ అపూర్వ నటన...!!గుర్రం జాషువా గారి అపూర్వ పద్య రచన...
కలిపి తెలుగులో చలన చిత్రం నిర్మించి వుంటే.. నభూతో..నభవిష్యతి...!!!(గా వుండి వుండెడిది)

కాబోలు బ్రహ్మరక్షస్సమూహం బిది-ఘోషించుచుండె ఋక్కుల క్రమంబు
కాఁబోలు వీరు విగత జీవబాంధవు-లడలుచుండిరి మహార్తారవములఁ
గాఁబోలు వీరు టక్కరి భూతమాంత్రికుల్‌-నెమకుచుండిరి కపాలముల కొఱకు
గాఁబోలు నిది పిశాచీబాంధవ శ్రేణి-పలలంపు బువ్వంపు బంతి సాగెఁ
జిట్లుచున్నవి కాఁబోలు చితులలోనఁ-గాల్పఁబడెడు శవాల కంకాళ సమితి
నెటఁబెడీలను రవములే యొసఁగుచుండు-దిక్కులన్నిండ మార్మోగింత పిక్కటిల్ల.
.
గీ. కాటిసుంకంబు చెల్లింపకయె శవాల
మసనమునఁ గాల్పరే కద మనుజులార?
కాఁపు లేదనుకొంటిరేమో పదండు
దళిత ఘోరారి యీ వీరదాసు గలఁడు.
.......
శా. మాయామేయజగంబె నిత్యమని సంభావించి మోహంబునన్‌
నా యిల్లాలని నా కుమారుఁడని ప్రాణంబుండునందాఁక నెం
తో యల్లాడిన యీ శరీర మిపుడిందుం గట్టెలం గాలుచో
నా యిల్లాలును రాదు పుత్రుఁడును దోఁడైరాఁడు తప్పింపగన్‌.
..........
ఇది ఎం వి అప్పారావు గారి పాత పోస్ట్...

ఆంగ్ల భాషా పదాలను యుపయోగించి హరికధా పితామహ శ్రీ ఆదిభట్ల నారాయణదాసు గారు శివునిపై
ప్రార్ధనను ఇలా హాస్యంగా చేప్పారు :

హెడ్దున మూను, స్కిన్నుపై అంతను డస్టును ఫైరు నేత్రమున్
సైడున గ్రేట్ బుల్లు, బహు చక్కని గేంజస్ హెయిర్ లోపలన్
బాడీకి హాఫెయౌచు నల పార్వతి మౌంటెన్ డాటరుండ
షుడ్డు డివోటీ దండము, ప్రేయరు చేయుచున్.

__/\__

24, ఏప్రిల్ 2017, సోమవారం

ఏ కులము నీదంటే గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు.. మా కులమే లెమ్మంది
ఏ కులము నీదంటే గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు.. మా కులమే లెమ్మంది
ఏడు వర్ణాలు కలిసి ఇంద్రధనస్సవుతాది
అన్నీ వర్ణాలకు ఒకటే ఇహము పరముంటాది
ఏడు వర్ణాలు కలిసి ఇంద్రధనస్సవుతాది
అన్నీ వర్ణాలకు ఒకటే ఇహము పరముంటాది
ఏ కులము నీదంటే.. గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు.. మా కులమే లెమ్మంది
ఆది నుంచి ఆకాశం మూగది... అనాదిగా తల్లి ధరణి మూగది
ఆది నుంచి ఆకాశం మూగది... అనాదిగా తల్లి ధరణి మూగది
నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు
నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు
ఈ నడమంత్రపు మనుషులకే మాటలు... ఇన్ని మాటలు
ఏ కులము నీదంటే గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు.. మా కులమే లెమ్మంది

చిత్రం : సప్తపది (1981)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, జానకి
ఏకాంతం.!.మనది మనకే స్వంతం!
జీవితాంతం..మనతో వుండే నేస్తం !
మనలోకి మనం తొంగి చూసే సమయం!
ఆస్వాదించాలి....ఆసాంతం!...
.....'వసుధ'

22, ఏప్రిల్ 2017, శనివారం

ఈరోజు నాకు అందిన message...
"పుత్రులు ఏడు రకాలుగా జన్మిస్తారు"
----×××---×××---×××---×××---×××----

1) పూర్వ జన్మలో తన సొమ్మును దాచమని ఒక వ్యక్తికి ఇచ్చి, అది తీసుకోకుండానే మరణించినవాడు, తాను దాచిన సొమ్ము తీసుకోవడానికి ఆ ఇంట్లో పుత్రుడుగా జన్మిస్తాడు.

2) తాను పూర్వ జన్మయందు బాకీపడిన అప్పును (ఋణాన్ని) చెల్లించుటకు పుత్రుడుగా జన్మిస్తాడు.

3) పూర్వ జన్మలోని శత్రుత్వం తీర్చుకోవడానికి ఈ జన్మలో పుత్రునిగా జన్మిస్తాడు.

4) పూర్వ జన్మలో తనకు ఒకడు అపకారం చేసాడు. దానికి ప్రతీకారం తీర్చుకోలేదు. ఈ జన్మలో ప్రతీకారం తీర్చుకోవడానికి అపకారం చేసినవాడికి పుత్రునిగా జన్మిస్తాడు.

5) పూర్వ జన్మలో తాను అనుభవించిన సేవ - సుఖములకు బదులు తీర్చడానికి పుత్రునిగా జన్మించి తల్లిదండ్రులకు సేవ చేస్తాడు.

6) పూర్వ జన్మలో తాను ఏ వ్యక్తి నుండి ఉపకారం పొందుతాడో, ఆ ఉపకారానికి బదులుగా ఉపకారం చేయుటకు పుత్రునిగా జన్మిస్తాడు.

7) ఏమీ ఆపేక్షించనివాడు కూడా పుత్రునిగా జన్మించి, తన విధులను తీరుస్తాడు.

ఇలా పుత్రులుగా జన్మించినవారు కర్మానుసారముగా తమ పనులు పూర్తికాగానే మరణిస్తారు, లేదా దీర్ఘకాలం జీవించి ఉపకారం చేయడమో, ప్రతీకారం తీర్చుకోవడమో చేస్తారు. కేవలం పుత్రులే కాదు, భార్య - భర్త - సోదరుడు - పనిమనిషి - ఆవు - కుక్క మొదలైన పశువులు కూడా కర్మరుణం తీర్చుకోవడానికి మనతో ఉంటారు. ఋణము తీరగానే వదిలి వెళ్ళడమో, పరలోకానికి చేరడమో జరుగుతుం.
// గౙల్ //

తానే  మేలిముసుగు తీసి ఒక జవ్వని పువ్వులాగా నవ్వుతుంటే ఏంచేయను?
నవ్వే ఆ నవ్వుతోనే మెలమెల్లగా పిడుగులే రువ్వుతుంటే ఏంచేయను?

నేను అనుకొంటినా మరి కలగంటినా? నాలో అనురాగమేదో మ్రోగేనని
అందమే నన్ను చేరి కొనగోటితో గుండెలో మీటుతుంటే ఏంచేయను?

చేత మధుపాత్ర లేదు నాకిప్పుడు అయినా అంటారు నన్నే తాగానని
కన్నులే పొంగిపోయే మధుపాత్రలై కైపులో ముంచుతుంటే ఏంచేయను?

నేను ఫిరదౌసినా మరి కాళిదాసునా? కాని అంటారు నన్నే కవిరాజని
ప్రేయసి మధుర రూపం మహా కావ్యమై ఊహలో పొంగుతుంటే ఏంచేయను?

// సి.నారాయణ రెడ్డి //

చలన చిత్రంలో వచ్చిన తొలి తెలుగు గౙల్ ఇది. 1979 లో వచ్చిన ‘అక్బర్ సలీం అనార్కలి’ చిత్రంలో మొహమ్మద్ రఫీ, సి.రామచంద్ర సంగీతం లో పాడిన గౙల్ ఇది.

21, ఏప్రిల్ 2017, శుక్రవారం

దేవుడు అన్ని చోట్ల ఉండలేక...
మొదట ప్రాణం పోసే తల్లితండ్రిని...
తరువాత...తన చెమటచుక్కతో
మనకడుపులు నింపే రైతును...
అనారోగ్యంతో అర్దాంతరంగా ఆగిపొయే..
ప్రాణులకు...
ప్రాణాలను పోసే...వైద్యులను
మనప్రాణాలకు తమ ప్రాణాలను
అడ్డువేసె జవాన్ లను..
పుట్టించాడు...
ఇంతమంది మన ప్రాణదాతలను ఇచ్చాడు....
విలువకట్టలేని వీరి త్యాగానికి...
ఏమిచ్చినా ఋణం తీరదు...

20, ఏప్రిల్ 2017, గురువారం

ఎందరికో అది కోరినా దొరకని వరం

మృత్యువు...
ఎందరికో అది కోరినా దొరకని వరం..
కానీ అందరికీ తప్పని ఓ కలవరం..
కర్మ ఫలం అనుకున్నా..
శరీరధర్మ శాస్త్రం అనుకున్నా..
ఎదుర్కోక తప్పని మహా సంకటం..
నువ్వు ఓడిపోక తప్పని నీ కడ సమరం..
ఒక్క క్షణంలోనే..
నీ అనే అహాన్ని అంతా తుడిపేస్తుంది..
నీ బంధాలనన్నింటినీ దూరం చేస్తుంది..
నిజాన్ని చూపించి నిన్ను నిశ్చేస్తుడిని చేస్తుంది..
నీ అజ్ఞానానికి నిన్నే కుమిలిపోయేలా చేస్తుంది..
అందుకే ఉన్నప్పుడే, బ్రతికి ఉన్నప్పుడే..
నీ తోటి వారికి సాయం చెయ్యి..
నీ తోడుగా నిలిచే వారికి ప్రాణం పొయ్యి..

17, ఏప్రిల్ 2017, సోమవారం

“సీతా-స్వయంవర-సత్కథ”

(ఫేస్ బుక్ వారి సౌజన్యంతో - నిరుడు “ప్రచురింపబడిన” హరికథ)

'వాగ్దానం' సినిమా-లోని 'సీతా-స్వయంవర-సత్కథను' (హరికథ) వ్రాసినది విప్లవకవి, నాస్తికుడు అయిన  శ్రీ- 'శ్రీశ్రీ' అంటే  చాలామందికి వింతగా తోచవచ్చు. అంతే కాదు ఆ సినిమా లో ఒక్కొక్క కవికి ఒక్కొక్క పాటను వ్రాసే అవకాశాన్ని ఇచ్చిన నిర్మాత, దర్శకుడు ఎవరంటే - 'ఆత్రేయ!' దానితో ఆయన నష్టపోయినా అందులోని పాటలు 'నా కంటిపాపలో నిలిచిపోరా! (దాశరథి)”  వంటివి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాయి!

(సంగీతం పెండ్యాల)

ఈ హరికథ పాట రసజ్ఞులకు ఎంతో వీనులవిందు చేసింది. . హరికథలోనైతే ఘంటసాలవారి గొంతు (అన్నట్లు ఈ పాటను తెరపైన పాడినది 'రేలంగి’, వయొలిన్ సహకారం ‘సూర్యకాంతం’!) నవరసాలను గుప్పించింది. ఇందులో కవి చేసిన ప్రయోగం ఏమిటంటే - కొంత  తన దిట్టతనాన్ని చూపిస్తూనే కొన్ని మంచి పద్యాలను కూడా  వెతుక్కొని హరికథలో చొప్పించడం.

ఇక, కొంచెం వివరంగా ఈ హరికథను గమనించుదాం.
(ఈ తరంవాళ్ళకు ఉపయోగించేందుకై కొన్ని మాటలకు అర్థాలను ఇవ్వక తప్పడంలేదు!)

1) ఎత్తుకోవడం (కానడ రాగంలో) - గణపతి ప్రార్థన

'శ్రీనగజాతనయం సహృదయం చింతయామి సదయం; త్రిజగన్మహోదయమ్'
(మూడులోకాలకెల్లా శ్రేష్ఠుడు, దయాపూర్ణుడు, పార్వతీపుత్రుడు అయిన వినాయకుడిని  స్మరిస్తాను.)

2) ఆ తరువాత 'శ్రీరామకథను' 'చెప్పిన కథ చెప్పినచోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను' అనే చమత్కారం; గాత్రసౌలభ్యంకోసం పాలూ, మిరియాలూ ...

3) ఆ సభకు విచ్చేసిన వీరాధివీరులలో అందరినీ ఆకర్షించిన ఒకే ఒక  దివ్యసుందరమూర్తి -

'రఘురాముడు - రమణీయ వినీలఘనశ్యాముడు  (అందమన నల్లనిమబ్బువంటి రంగు కలిగినవాడు)

వాడు; నెలరేడు (చంద్రుడే); సరిజోడు (ఇతడితో సరితూగగలిగినవాడు); మొనగాడు;
వాని కనులు మగమీలన్ (మగచేపలను - 'మీనులు +లు = మీలు' ) ఏలురా (మించిన అందం కలిగినవి); వాని నగవు రతనాల జాలురా (రత్నాలను తలపింపజేస్తుంది  - రత్నాలలాంటి పలువరుస); వాని-జూచి మగవారలైన మైమరచి (మగవాళ్ళు కూడా తమను తామే మరచిపోయి - 'పుంసామోహనరూపం' అంటారు దీనిని); మరుల్-గొనెడు (మోహించే) మరో మరుడు (మన్మథుడు); మనోహరుడు (మనసులను దొంగిలించేవాడు) (ఇదంతా ‘శంకరాభరణం’ రాగంలో)

4) ఆ ప్రకారంబుగా .. (ఇక్కడ ఒక విషయం - వాల్మీకి రామాయణం ప్రకారం రాముడు శివధనుస్సును నిండు సభలో ఎక్కుపెట్టలేదు! కాని, దక్షిణాదిన, ఉత్తరాదిన కూడా తులసీదాస్ వంటివారి కల్పన ఇది. వాళ్ళ కథ ప్రకారం - సీతారాములది love at first sight!)

5)  సీతాదేవి అంత:పుర గవాక్షమునుండి (కిటికీలోనుండి) వీక్షించినదై ఈ విధంగా అనుకొన్నది (మోహనరాగంలో) -

“ఎంత సొగసుగాడే! మనసింతలోనె దోచినాడె;
మోము కలువరేడే (సాక్షాత్తూ చంద్రుడే); నా నోముఫలము వీడే!
శ్యామలాభిరాముని (నల్లనిరంగుతో చక్కగా రంజింపజేస్తున్న ఇతడిని ) చూడగ, నా మది వివశమాయెనే (అదుపు తప్పింది!)”

6) అక్కడ స్వయంవరసభామంటపంలో  (ధన్యాసి)  జనకుడేమన్నాడంటే -

“అనియెనిట్లు ఓ యనఘులార!(పుణ్యచరితులారా!) నా అనుగుపుత్రి సీత; వినయాదికసద్గుణవ్రాత (వినయము మొ/ సద్గుణాలసమూహంతో కూడినది); ముఖ-విజిత-లలిత-జలజాత (లేతతామరపూవును తనముఖ-సౌందర్యంకారణంగా తలదన్నినది);
ముక్కంటి వింటి (శివుడి విల్లును) నెక్కిట  (గొప్పగా) దాకిన (ఎక్కుపెట్టిన) ఎక్కటిజోదును (సాటిలేని - అసహాయశూరుడైన యోధుడిని) నేడు మక్కువమీరగ (ఇష్టం ఎక్కువయేటట్లు) మాల వైచి (దండను వేసి) పెండ్లాడు .. “

ఆ  విల్లును చూచి ఎక్కడివాళ్ళు అక్కడే చల్లబడిపోయారట!
అక్కడకు  వచ్చిన రావణుడు కూడా 'ఈ చాపమునెత్తుట పాపము' అని ఊరకుండిపోయాడట!

అప్పుడు -

7) ఇనకుల-తిలకుడు (సూర్యవంశములో శ్రేష్ఠుడు)
- నిలకడగల క్రొక్కారుమెరుపు వలె నిల్చి (కదలకుండా - స్థిరంగా ఉన్న) క్రొత్త కారుమబ్బు (నీలమేఘం)  (మెరుపు చంచలంగా క్షణకాలమే ఉంటుంది, ఈయన స్థైర్యవంతుడు కదా!)

- తన గురువగు విశ్వామిత్రుని ఆశీర్వాదము తలదాల్చి,
- సదమల మదగజగమనముతోడ (ఈ శబ్దాలంకారపు సొంపును గమనించండి)
మెరసిపోతున్న మదపుటేనుగు నడకవంటి ఠీవితో (వాల్మీకి రాముడి నడకను ఏనుగు నడకతో పోల్చాడు - 'గజవిక్రాంతగమన, మదమాతంగగామీ' అనే ప్రయోగాలలో - అందుకనేనేమో త్యాగరాజుగారు కూడా 'సామజవరగమన!' అని పాడాడు.)

స్వయంవరవేదిక చెంత;

మదనవిరోధి-శరాసనమును (మన్మదుడిని కాల్చివేసిన శివుడి విల్లును)
తన కరమున పూనినయంత - చేతిలో 'అలా' పట్టుకోగానే

“ఫెళ్ళుమనె   విల్లు; గంటలు ఘల్లుమనె; గు-
భిల్లుమనె గుండె నృపులకు; ఝల్లుమనియె
జానకీదేహ మొక్క నిమేషమందె
నయము; భయము జయమును వి-స్మయము గదుర!”

(ఆ విల్లు విరిగినప్పుడు గొప్పతనం (విరగడంలో); భయం (మిగిలిన రాజుల గుండెల్లో);
జయసూచన (గంటలు మ్రోగడంలో); ఆశ్చర్యం (జానకీదేహం ఝల్లుమనడంలో) - ఇవన్నీ  ఏకకాలంలోనే కలిగాయట! (వరుసగా చెప్పుకొచ్చాడు కాబట్టి క్రమాలంకారం, కేదారగౌళరాగంలో పాడబడింది!)

(ఈ పద్యం కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రిగారిది!)

ఆ పిమ్మట (కల్యాణీరాగంలో)-

భూతలనాథుడు రాముడు
ప్రీతుండై పెండ్లియాడె పృథుగుణమణిసం
ఘాతన్, భాగ్యోపేతన్,
సీతన్, ముఖకాంతివిజిత-సితఖద్యోతన్ \\

(భూపతియైన  రాముడు); (పృథుగుణమణిసంఘాతన్ - దొడ్దగుణాలనే మణులతో కూడినట్టిది; భాగ్యోపేతన్ = అదృష్టంతో  కూడినది (లక్ష్మీదేవి) ; ముఖకాంతివిజిత-సితఖద్యోతన్ - తన ముఖకాంతివలన గెలువబడిన తెల్లని చంద్రుడిని  కలిగినది, అయిన సీతను ; ప్రీతుండై = ఎంతో ఇష్టపడి ; పెండ్లియాడె)

(ఈ పద్యంలోని అంత్యప్రాసలను గమనించారా? - తెలుగులో అలాంటి ప్రయోగాలను పుష్కలంగా చేసిన సహజకవి ఎవరంటే - తెలుగువారు గర్వించవలసిన పోతనామాత్యుడు (భాగవతం 9వ స్కంధంలో రామాయణకథ సంగ్రహంగా వస్తుంది. అక్కడిది ఈ పద్యం!)

మరి శ్రీశ్రీ అంటే ఆషామాషీ కవి కాదు! - ఆయన మేనల్లుడు ఆరుద్ర అయితే 'సమగ్ర- ఆంధ్రసాహిత్యాన్నే’ మనకు అందించాడు.

(ఆయనను కూడా ఎందుకు పేర్కొంటున్నానంటే, తనూ కమ్మ్యూనిస్టు భావాలు కలిగినవాడైనా 'అందాలరాముడు, ఇందీవరశ్యాముడు .. (ఉయ్యాలా-జంపాలా); 'శ్రీరామనామాలు శతకోటీ, ఒక్కొక్క పేరే బహు తీపీ (మీనా)' వంటి గొప్ప పాటలను రచించాడు!

('తరించారు' అంటే వాళ్ళ ఆత్మలు అంగీకరిస్తాయో లేదో?) - మనకి మాత్రం తరగని సంపదగా వీటిని ఇచ్చివెళ్ళారు.  

సీతారాముల కల్యాణం అయింది కదా!

పోతనగారి మరొక పద్యాన్ని (9వ స్కంధంలోనిదే) తలచుకొని మురిసి, ఎవరిదారిని వాళ్ళు వెళ్దాం.

ఉ/  నల్లనివాడు పద్మనయనమ్ములవాడు; మహాశుగమ్ములున్
విల్లును దాల్చువాడు, కడు విప్పగు వక్షమువాడు, మేలు పై
జల్లెడువాడు, నిక్కిన భుజంబులవాడు, యశంబు దిక్కులన్
జల్లెడువాడు నైన రఘుసత్తముడిచ్చుత మాకభీష్టముల్ \\    

మంగలం కోసలేంద్రాయ - మహనీయగుణాత్మనే \
చక్రవర్తీతనూజాయ - సార్వభౌమాయ మంగళం \\

సర్వే జనా: సుఖినో భవన్తు /

13, ఏప్రిల్ 2017, గురువారం

‘G’ అంటే generation ట టెలికామ్ వారి భాషలో !!
మొన్న 2G,
నిన్న 3G,
నేడు 4G,
రేపు 5G
మరి మన బ్రతుకులో .. క్యా .. జీ ??!!
చదువులో మొదటి మెట్టు ఎల్కేజీ
ఆఖరి మెట్టు .. కాలేజీ
ఉద్యోగంలో బాస్ దగ్గర ‘హాం .. జీ’
భార్యకి భర్త జీ, పట్టు చీర కొనాలంటే అనక తప్పదు ‘హాం .. జీ’
ప్రభుత్వ కార్యాలయంలో పని జరగాలంటే .. జీ .. జీ
తలెత్తుకు నడవాలంటే కుదరదు జీ
ఎంత ఎదిగినా బ్రతుకులో తప్పదు రాజీ
.. పొన్నాడ మూర్తి

  • (My pencil sketch)

10, ఏప్రిల్ 2017, సోమవారం

👉కళ్ళు మూసుకుని ప్రేమించేది *ప్రియురాలు*
👉కళ్ళు తెరుచుకుని ప్రేమించేది *స్నేహితురాలు*
👉కళ్ళు ఉరిమి ప్రేమించేది *భార్య*

👉 *కళ్ళు మూసేవరకూ ప్రేమించేది "అమ్మ"*

👉 *కళ్ళల్లో ప్రేమ కనబడకుండా ప్రేమించేది "నాన్న..."*🚶

👉 *నాన్నకి అంకితం* 🏃
-----------------
👉అమ్మ .. ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది.
👉నాన్న .. ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తాడు.
👉 *జీవితం అమ్మది - జీవనం నాన్నది.*
-------------------
👉ఆకలి తెలీయకుండా అమ్మ చూస్తుంది .
👉ఆకలి విలువ తెలిసెలా నాన్న చేస్తాడు .
👉 *అమ్మ భద్రత - నాన్న బాధ్యత.*
------------------
👉పడిపోకుండా పట్టుకోవాలని అమ్మ చూస్తుంది.
👉పడినా పైకి లేవాలని నాన్న చెప్తాడు
👉 *నడక అమ్మది - నడవడిక నాన్నది.*
--------------------
👉తన అనుభవాలను విద్యలా బోధిస్తుంది అమ్మ.
👉నీ అనుభవమే విద్య అని తెలిసెలా చేస్తాడు నాన్న .
*అమ్మ అలోచన-నాన్న ఆచరణ*
----------------
👉అమ్మ ప్రేమను నీ పసిప్రాయం నుండే తెలుసుకొగలవు.
      But... కానీ ....
👉నాన్న ప్రేమను నువ్వు *నాన్నవు*అయ్యాకే తెలుసుకోగలవు...

💐🙏🌹👍
: కొడుకు :ఈ రోజు నా గుండె operation నాన్న


నాన్న :తెలుసురా ఎందుకు బయపడుతున్నావ్ నేను ఉన్నానుకదా నీకు


కొడుకు :i love u నాన్న


నాన్న :i love u too ra చెపుతూ
 ఏడ్చాడు


Operastion తరువాత ఎప్పుడైతే ఆ అబ్బాయ్ కి మెలుకువ వచ్చిందో కళ్ళ ముందు ఒక్క ఫ్రెండ్ ఉన్నాడు



కొడుకు :మా నాన్న ఎక్కడా



ఫ్రెండ్ :నీకు తెలియదా నీకు గుండె ఏవరిచ్చారో  మీ నాన్నేనురా !



కొడుకు :గుండె పగిలేల ఏడవడం మొదలుపెట్టాడు
అప్పుడు గుండె నుండి ఒక్క శబ్దం వచ్చింది  ఏడవకురా నీ గుండె చప్పుడులో నేను ఎప్పుడు నీతో బ్రతికే ఉంటానురా



కొడుకు :i miss you నాన్న


మన కాళ్ల మీద మనం
నిలబడ్డామని అమ్మ నాన్నని దూరం పెట్టకు. మనం ఇలా నిలబడడానికి అమ్మ నాన్న మన ముందుండి  నడిపించారు మర్చిపోకు మన  భారాన్ని  అంత నాన్న మోస్తూ మనల్ని నడిపించాడు మనం సంతోషగా బ్రతకడానికి తన ప్రాణాలను  దరబోసే వాడు నాన్న


I love you నాన్న.....
👴👴👴👴
తెలుగువాడు కాడు, తీపరపడకున్న;
తెలుగువాడు కాడు, తెగడకున్న;
తెలుగువాడు కాడు తెగులేదో లేకున్న
నవయుగాలబాట నార్లమాట!

తిక్క కొంత లేక తెలుగువా డెటులౌను?
తెలుగుతనము లేదు తిక్కలేక;
తెలుగుజాతి కవియె తిక్కనామాత్యుండు
నవయుగాలబాట నార్లమాట!

__/\__

9, ఏప్రిల్ 2017, ఆదివారం

కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకమ్, మౌనేన కలహో నాస్తి, నాస్తి జాగరతో భయమ్.!

5, ఏప్రిల్ 2017, బుధవారం

మహాభారతంలో ఒక పద్యం వుంది.
‘ఒరులేయవి యొనరించిన
నరవరయప్రియము తన మనంబునకగుదా
నొరులకునవి సేయకునికి
పరాయణము పరమధర్మపధములకెల్లన్’ -  
‘ఎవరు ఏమి చేస్తే నీకు అప్రియం అనిపిస్తుందో అదే పని నీవు ఇతరుల విషయంలో చేయకు’ అన్నది దాని తాత్పర్యం.

3, ఏప్రిల్ 2017, సోమవారం

వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ !!



వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ !!
వందే పార్వతీప రమేశ్వరౌ

నాద వినోదము నాట్య విలాసము
పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము
సలుపు పరమ పదమూ
భావములో ఆ.. భంగిమలో ఆ..
గానములో ఆ.. గమకములో ఆ...
భావములో భంగిమలో
గానములో గమకములో
ఆంగికమౌ తపమీ గతి సేయగ

నాదవినోదము నాట్యవిలాసము
పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము
సలుపు పరమ పదమూఆ..ఆ..ఆ.........

ని ని మ ద ని ని.. ని.. మ ద ని స ని.. ని..
రి స ని ద ని.. ని
మ గ మ ద ద  గ మ మ రి గ స

కైలాసాన కార్తీకాన శివ రూపం
ప్రమిదే లేని ప్రమధాలోక హిమదీపం
కైలాసాన కార్తీకాన శివ రూపం
ప్రమిదే లేని ప్రమధాలోక హిమదీపం
నవరస నటనం .. ద ని స రి స ని స
జతియుత గమనం .. ద ని స రి స ని స
నవరస నటనం జతియుత గమనం
సితగిరి చలనం సురనది పయనం

భరతమైన నాట్యం .. ఆ...
బ్రతుకు నిత్య నృత్యం .. ఆ...
భరతమైన నాట్యం .. ఆ...
బ్రతుకు నిత్య నృత్యం .. ఆ...
తపనుని కిరణం తామస హరణం
తపనుని కిరణం తామస హరణం
శివుని నయన త్రయలాశ్యం
ధిరన ధిరననన తకిట తకిటతధిమి
ధిరన ధిరననన నాట్యం
ధిరన ధిరననన తకిట తకిటతధిమి
ధిరన ధిరననన లాస్యం
నమక చమక సహజం ..ఝం
నటప్రకృతీ పాదజం .. ఝం
నర్తనమే శివకవచం .. చం
నటరాజ పాద సుమరజం .. ఝం
ధిరనన ధిరనన ధిరనన ధిరనన
ధిర ధిర ధిర ధిర ధిర ధిర..

నాదవినోదము నాట్యవిలాసము
పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము
సలుపు పరమ పదమూ
https://youtu.be/ckuYaGGkqjw

1, ఏప్రిల్ 2017, శనివారం

పసరంబు పంజైన - బసుల గాపరి తప్పు
ప్రజలు దుర్జనులైన - ప్రభుని తప్పు
భార్య గయ్యాళైన - బ్రాణనాథుని తప్పు
తనయుండు దుష్టుడైన - తండ్రి తప్పు
సైన్యంబు చెదరిన - సైన్యనాథుని తప్పు
కూతురు చెడుగైన - మాత తప్పు
అశ్వంబు చెడుగైన - నారోహకుని తప్పు
ఇట్టి తప్పులెఱుంగక - ఇచ్చవచ్చి
నటుల మెలగుదు రిప్పుడీ- యవని జనులు
భూషణవికాస! శ్రీ ధర్మ - పుర నివాస!
దుష్టసంహార! నరసింహ! - దురిత దూర!!
ఈపాట తెలియని తెలుగువారు లేరంటే విచిత్రం కాదు.ఈపాటను ప్రముఖ సంగీత విద్వాంసుడు శ్రీ పాలగుమ్మి విశ్వనాథం గారు రచించారు.తన కుమార్తె ను మెట్టింటికి పంపుతూ ఆ ప్రేమ , కుమార్తె మీద అభిమానం తో వారు వ్రాసిన ఈ పాట అత్యద్భుతంగా ప్రజాదరణ పొందినది.ఇంక ఈ పాటను ప్రముఖ లలిత సంగీత గాయని శ్రీమతి వేదవతీ ప్రభాకర్ గారు మృదుమంద్రంగా అత్యద్భుతంగా ఆలపించారు.వేదవతీ ప్రభాకర్ రావు గారు తెలియని వారు కూడా ఉండరు.అవిడ ఆకాశవాణి మరియు దూరదర్శన్ లో అనేక లలిత గీతాలు ఆలపించారు.

సాహిత్యం: పాలగుమ్మి విశ్వనాథ్
సంగీతం : పాలగుమ్మి విశ్వనాథ్
గానం : వేదవతీ ప్రభాకర్

అమ్మ దొంగా నిన్ను చూడకుంటే.. నాకు బెంగా
కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ
నా కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ
కల కలమని నవ్వుతూ కాలం గడిపే నిన్ను...
చూడకుంటే.. నాకు బెంగా...

||అమ్మ దొంగా||

కధ చెప్పే దాకా కంట నిదుర రాకా
కధ చెప్పే దాకా నీవు నిదుర బోకా
కధ చెప్పే దాకా నన్ను కదలనీక.
మాట తోచనీక...మూతి ముడిచి చూసేవు...

||అమ్మ దొంగా||

ఎపుడో ఒక అయ్య నిన్నెగరేసుకు పోతే...
నిలువలేక నా మనసు నీ వైపే లాగితే...
ఎపుడో ఒక అయ్య నిన్నెగరేసుకు పోతే...
నిలువలేక నా మనసు నీ వైపే లాగితే...
గువ్వ ఎగిరి పోయినా గూడు నిదుర పోవునా...

||అమ్మ దొంగా||

నవ్వితే నీ కళ్ళు ముత్యాలు రాలు...
ఆ నవ్వే నిను వీడక ఉంటే అది చాలు...
నవ్వితే నీ కళ్ళు ముత్యాలు రాలు...
ఆ నవ్వే నిను వీడక ఉంటే పది వేలు..
కలతలూ కష్టాలు నీ దరికి రాకా
కలకాలము నీ బ్రతుకు కలల దారి నడవాలి
కలతలూ కష్టాలు నీ దరికీ రాకా కలకాలము
నీ బ్రతుకు కలల దారి నడవాలి...

||అమ్మ దొంగా||

23, మార్చి 2017, గురువారం

నాన్న ఎప్పుడూ ఒంటరివాడే,

అమ్మా,పిల్లలూ ఒక్కటౌతుంటారు ఈ సృష్టిలో.

నాన్న ఎప్పుడూ తుంటరివాడే,

అమ్మమాత్రమే తరుచూ మంచిది అవుతూ ఉంటుంది, పిల్లల దృష్టిలో.

కని,పెంచటం అమ్మేఅన్నట్లు కనిపిస్తుంది,

నాన్నబాధ్యత ఏమీ లేనట్టు అనిపిస్తుంది.

కనటం అమ్మేఅయినా కలలుకనటం నాన్న పనేనని

ఎంతమంది పిల్లలకు అర్ధమౌతుంది?

పెంచటం అమ్మే అయినా బాధ్యతెరిగి పెరగటం నాన్నవల్లేనని,

కొంతమంది పిల్లలకే బోధపడుతుంది.

సేవచేయటం అమ్మవంతు,

సరిచేయటం నాన్నతంతు.

అమ్మకు ఎప్పుడూ పిల్లలలోని గుణాలే కనబడుతాయి,

నాన్నకు మాత్రం పిల్లలలోని గుణాలతోపాటు
దోషాలుకూడా కనబడుతాయి.

ప్రేమించటం అమ్మవంతు అయితే,
దీవించటం నాన్నవంతు.

ఆకలితీర్చటం అమ్మవంతు అయితే,
ఆశలుతీర్చటం నాన్నవంతు.

అమ్మప్రేమ అనుక్షణం బహిర్గతమౌతుంటుంది,

నాన్నదీవెన ప్రతిక్షణం అంతర్గతంగానే ఉంటుంది.

అమ్మగుండెలో పిల్లల సుఖానికి
సంబంధించిన ఆలోచనే ఉంటుంది.

నాన్నగుండెలో పిల్లల క్షేమానికి
అనుబంధించిన ఆవేదనే ఉంటుంది.

అమ్మఆరాటాన్ని కన్నీళ్లు చెపుతాయి,

నాన్నఆత్రుతని కళ్ళు మాత్రమె చెపుతాయి.

కనిపించే ఆరాటం అమ్మది,

కనిపించని పోరాటం నాన్నది.

అమ్మకి లైకులెక్కువ,

నాన్నకి షాకులెక్కువ.

అమ్మ ఏడవటం కనిపిస్తుంది,

నాన్నఎద చెరువవటం కనిపించదు.

గుర్తింపు తెచ్చుకున్న దేవత అమ్మ,

గుర్తింపు పొందలేని దేవుడు నాన్న.

పిల్లల జీవితానికి అమ్మ ఒకకళ అయితే,
నాన్న తళతళ.

కనిపించే దేవత అమ్మ అయితే,

కనపడని దేవుడు నాన్న.

పిల్లల ఓట్లే అమ్మకు ఆస్తి,

నాన్నకు మాత్రం అన్నీ నాస్తి....

19, మార్చి 2017, ఆదివారం

https://drive.google.com/open?id=0B8VeAg1T0udMLUJmRXJPcGo4V2s.......

చందమామ కథలు pdf

శంకరా... నాదశరీరా పరా... వేదవిహారా హరా.. జీవేశ్వరా



శంకరా... నాదశరీరా పరా...
వేదవిహారా హరా.. జీవేశ్వరా
శంకరా... నాదశరీరా పరా...
వేదవిహారా హరా జీవేశ్వరా
శంకరా...

చరణం 1 :

ప్రాణము నీవని గానమె నీదని.. ప్రాణమె గానమనీ...
మౌన విచక్షణ.. గాన విలక్షణ.. రాగమె యోగమనీ...
ప్రాణము నీవని గానమె నీదని.. ప్రాణమె గానమనీ...
మౌన విచక్షణ.. గాన విలక్షణ.. రాగమె యోగమనీ...

నాదోపాసన చేసిన వాడను.. నీ వాడను నేనైతే
నాదోపాసన చేసిన వాడను.. నీ వాడను నేనైతే

ధిక్కరీంద్రజిత హిమగిరీంద్రసితకంధరా నీలకంధరా
క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్ణిద్ర గానమిది అవధించ రా...
విని తరించరా ...

శంకరా... నాదశరీరా పరా...
వేదవిహారా హరా జీవేశ్వరా
శంకరా...

చరణం 2 :

మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు
మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు

పరవశాన శిరసూగంగా...  ధరకు జారెనా శివగంగా
పరవశాన శిరసూగంగా...  ధరకు జారెనా శివగంగా

నా గానలహరి నువు మునుగంగ
ఆనందవృష్టి నే తడవంగా ఆ... ఆ... ఆ... ఆ..

శంకరా... నాదశరీరా పరా...
వేదవిహారా హరా జీవేశ్వరా
శంకరా... శంకరా... శంకరా...
Naveen Kumar:
నిన్నే నీవెరుంగమా నీవే దైవంబని విశ్వమంతకు చాటు వేదభూమి,
ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మ ఫలమొసగు కర్మ భూమి,
గుడి పావురాలకై తొడగోసి ఇచ్చిన భూమీశులేలిన పుణ్యభూమి,
కొల్లాయి గుడ్డతో కోటి శత్రుల గెల్చు జాతిపితను గన్న జన్మభూమి.సహజముగ పండు నేలలు చాల గలిగి,జీవధారలు ప్రవహించు చేవ గలిగి
అతి పురాతన సంస్కృతి ఖ్యాతి గలిగి
ధరణి నేలెడు స్వామి నా భరతభూమి!
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది |2|
సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నాదే
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
కవినై కవితనై భార్యనై భర్తనై |2|
మల్లెల దారిలో మంచు ఏడారిలో |2|
పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల
నాతో నేను అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ
వంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం
కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్నీ
రంగవల్లుల్ని కావ్యకన్యల్ని ఆడపిల్లల్ని
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది |2|
మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై |2|
మంటల మాటున వెన్నెల నేనై వెన్నెల పూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిశినై
నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ
వంటరినై ప్రతినిముషం కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల
చరణాల్ని చరణాల చలనాన కనరాని గమ్యాన కాలాన్ని ఇంద్రజాలాన్ని
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది |2|
గాలి పల్లకీలోన తరలి నా పాట పాప వూరేగి వెడలె
గొంతు వాకిలిని మూసి మరలి తన్మూగబోయి నా గుండె మిగిలె
నా హృదయమే నా లోగిలి నా హృదయమే నా పాటకి తల్లి
నా హృదయమే నాకు ఆలి నా హృదయములో ఇది సినీవాలి
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది |2|


18, మార్చి 2017, శనివారం

చెయ్యెత్తి జే కొట్టు...శ్రీకృష్ణ

చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా!
గతమెంతో ఘనకీర్తి కలవోడా!
                           
సాటిలేని జాతి-ఓటమెరుగని కోట
నివురుగప్పి నేడు-నిదురపోతుండాది
జైకొట్టి మేల్కొలుపు తెలుగోడా!
గతమెంతో ఘనకీర్తి కలవోడా!!||చెయ్యెత్తి||

వీర రక్తపుధార-వారబోసిన సీమ
పలనాడు నీదెరా-వెలనాడు నీదెరా
బాలచంద్రుడు చూడ ఎవడోయి!
తాండ్రపాపయ్య కూడనీవోడూ||చెయ్యెత్తి||

కాకతీయ రుద్రమ, మల్లమాంబా, మొల్ల
మగువ మాంచాల నీతోడ బుట్టినవాళ్ళే
వీరవనితల గన్న తల్లేరా!
ధీరమాతల జన్మ భూమేరా! ||చెయ్యెత్తి||

నాగార్జునుడి కొండ,అమరావతీస్థూపం
భావాల పుట్టలో-జీవకళ పొదిగావు
అల్పుడను కావంచు తెల్పావు నీవు
శిల్పినని చాటావు దేశదేశాలలో! ||చెయ్యెత్తి||

దేశమంతే వట్టి మట్టి కాదన్నాడు
మనుషులన్నమాట మరువబోకన్నాడు
అమరకవి గురజాడ నీవాడురా
ప్రజలకవితను చాటిచూపాడురా! ||చెయ్యెత్తి||

రాయలేలిన సీమ-రతనాల సీమరా
దాయగట్టె పరులు-దారి తీస్తుండారు
నోరెత్తి యడగరా దానోడా
వారసుడ నీవెరా తెలుగోడా! ||చెయ్యెత్తి||

కల్లోల గౌతమీ-వెల్లువల కృష్ణమ్మ
తుంగభద్రాతల్లి-పొంగిపొరలిన చాలు
ధాన్యరాశులే పండు దేశానా!
కూడుగుడ్డకు కొదవలేదన్నా!||చెయ్యెత్తి||

ముక్కోటి బలగమోయ్-ఒక్కటిగ మనముంటే
ఇరుగుపొరుగులోన -వూరు పేరుంటాది
తల్లి ఒక్కతే నీకు తెలుగోడా!
సవతిబిడ్డల పోరు మనకేలా! ||చెయ్యెత్తి||

పెనుగాలి వీచింది-అణగారి పోయింది
నట్టనడి సంద్రాన-నావ నిలుచుండాది
చుక్కాని బట్టరా తెలుగోడా!
నావ దరిచేర్చరా మొనగాడా!!
!! చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా||

16, మార్చి 2017, గురువారం

****** శవం ********
    శవమే కదా అని టన్ను కట్టెలలో కాల్చకు
     ఆరడుగుల గోతిలో తోయకు దాన్ని
     శవానికి  విలువ కట్టే గీటురాయి లేదు
      షరాబు దైనా గరీబుదైనా
       శవాల విలువ ఒక్కటే సుమా
       నేత్ర దానం చేసి చూడు
     మీలోని ఇరువురి అంధులకు
         చూపునిచ్చే శవానికి విలువ కట్టే
         షరాబు కలడా
       శవాన్ని వైద్యకళాశాలకు దానం
         చేసిచూడు
        విద్యార్దులకు శవం ఒక ప్రయోగశాల
       కోసి లోనున్న భాగాలను చూసి వారు పొందే
        జ్ఞానానికి  విలువ కట్టే            
             షరాబు కలడా
       చులకనగా చూడకు శవమే కదా అని
 దాని విలువ కట్టే తూకపు రాళ్ళు నివద్ద లేవోయ్
           ******** హరి*********

15, మార్చి 2017, బుధవారం

''సాహితీ సేవ''వారికి నా వందనాలు ....నాకీ అవకాశం ఇచ్చి నన్ను మీ ముందుంచిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు .
ఈ రోజు మీతో పంచుకొనే అంశం ''మనసు కవి ఆత్రేయ గారు ''

ఆచార్య ఆత్రేయ గా సినీరంగ ప్రవేశం చేసిన కిళాంబి వెంకట నరసింహాచార్యులు తెలుగులో సుప్రసిద్ధ నాటక, సినిమా పాటల, మాటల రచయిత,

నిర్మాత మరియు దర్శకులు. అత్రేయకి ప్రముఖ నటుడు కొంగర జగ్గయ్య ఆప్తమిత్రుడు.ఆత్రేయ వ్రాసిన పాటలు,నాటకాలు,నాటికలు,కథలు మొదలగు

రచనలన్నీ ఏడు సంపుటాలలో సమగ్రంగా ప్రచురించి జగ్గయ్య తన మిత్రుడికి గొప్ప నివాళి అర్పించాడు అని చెప్పవచ్చు.

విశ్వశాంతి నాటకానికి కూడా రాష్ట్ర స్థాయి బహుమతి లభించింది. 'సామ్రాట్ అశోక','గౌతమ బుద్ధ' మరియు 'భయం' నాటకాలు కూడా వ్రాసారు.

ఆత్రేయ పలు చలన చిత్రాలకు సంభాషణలు, పాటలు రాశారు. వీరి పాటలలో ఎక్కువగా మనసుకు సంబందించిన ప్రస్తావన ఉండటం వలన ఆయన మనసు కవి, మన 'సుకవి'

అయ్యాడు. దీక్ష (1950) చిత్రానికి తొలిసారి గీత రచన, అదే సంవత్సరంలో విడుదలైన సంసారం చిత్రానికి తొలిసారి కథా రచన చేసారు. వాగ్ధానం (1961) చిత్రాన్ని నిర్మించి,

దర్శకత్వం కూడా చేసాడు.

చిన్ని చిన్ని పదాలతో స్పష్టమైన భావాన్ని పలికించడంలో ఆత్రేయ ఘనాపాటి. తెలుగు పాటను ఆస్వాదించే అందరి మనసులను దోచుకొని మనసు కవి గా ప్రజల మన్ననలు పొందారు

తెలుగు సినీ సాహిత్య చరిత్రలో భావాన్ని ప్రేక్షకుడి మనసుకి సూటిగా తాకేట్టు చేయడంలో ఆత్రేయ స్థానం అనితర సాధ్యం. భాష చేత భావాలకు ఆయన ఎప్పుడూ వెట్టిచాకిరీ చేయించుకోలేదు. అయినా పదాలు ఆయన చేతిలో అతి అందంగా అమరిపోయాయి. ఒదిగిపోయాయి. ఒదుగు, ఒడుపు, జగి జిలుగులతో అతి చాకచక్యంగా పట్టుకోవడంలోనూ, ఆకట్టుకోవడంలోనూ ఆయన సిద్దహస్తుడే కాదు, ప్రసిద్ధ హస్తుడు కూడా.
ముఖ్యంగా మనిషి, మనసు, మమత, దేవుడు, విధి మీద రకరకాల ప్రయోగాలతో ఆత్రేయ రాసినన్ని పాటలు మరొకరు రాయలేదు.
ఉదాహరణకి ...............

పశువుల కన్నా పక్షుల కన్నా మనషిని మిన్నగ చేశాడు.
బుద్దిని ఇచ్చి హృదయాన్నిచ్చి భూమే నీదని పంపాడు.
బుద్ధికి హృదయం లేక హృదయానికి బుద్ధే రాక
నరుడే ఈ లోకం నరకం చేశాడు.
(దేవుడనేవాడున్నాడా - 'దాడుగుమూతలు')

మహాత్ములైనా దురాత్ములైనా మనుజుల పేరనే మసలేరయ్యా.
అందరికీ నీ అభయం కలదని అనుకోమందువా

దేవా
(వెలుగు చూపవయ్యా - 'వాగ్దానం')

ఒకడి ఆకలికి అంబలి నీళ్ళు ఒకరికి పాలు పళ్ళు
భలేభలేగా దగాల దేవుడ బాగా పంచేవు
కోతికి బాబనిపించేవు ఓ బ్రహ్మయ్య
నీ లీలలే గడబిడ ఎడపెడ నీ గడాబిడా మా కెడాపెడా
(ఓ బుచ్చిబాబు - 'నాటకాల రాయుడు')

ఇక మనుషుల తత్వాల గురించి:

తాము నవ్వుతూ నవ్విస్తారు కొందరు అందరినీ
తామేడుస్తూ ఏడ్పించుతారెందరో కొందరినీ
(దేవుడునే వాడున్నాడా - 'దాగుడుమూతలు')

మాటలలో చిక్కుపడి మనసు నలిగిపోతుంది
మనసులేని మాటలనే మనం నమ్ముతున్నది
పలుకలేని ప్రతిగుండె బాధతో నిండినది
ఒలికే ప్రతి కన్నీటికి చుక్క వెచ్చగా ఉంటుంది
(బ్రతుకు పూలబాట కాదు - 'భార్యాబిడ్డలు')

ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి
(నేను పుట్టాను - 'ప్రేమ్_నగర్')

మంచివాడికి, చెడ్డవాడికి తేడా ఒకటే బాబూ
మంచివాడు మనసున అనుకుంటాడు చెడ్డవాడు చేసే చూస్తాడు
(మనిషి మనిషికి తేడా ఉంది - 'పాప కోసం')

ఇక మనసు గురించి ఆత్రేయ మధన పడ్డంతగా మరొకరు కనిపించరు మనకి. ఒకటా... రెండా... ఎన్నో....ఎన్నెన్నో...

ఒక్క క్షణం మనసుకి మాటలు తడితే జలజల జాలువారిపోతాయి ఆయన పాటలు.

ఒకరికిస్తే మరలిరాదు, ఓడిపోతే మరచిపోదు.
గాయమైతే మాసిపోదు, పగిలిపోతే అతుకుపడదు.
(మనసుగతి ఇంతే - 'ప్రేమ్_నగర్')

ఊహల ఉయ్యాలవే మనసా, మాయల దయ్యానివే
లేనిది కోరేవు, ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
(మౌనమే నీ భాష - 'గుప్పెడు మనుసు')

వలచుట తెలిపిన నా మనసునకు
మరచుట మాత్రము తెలియనిదా
మనసిచ్చినదే నిజమైతే
మన్నించుటయే ఋజువు కదా
(నీ సుఖమే నే కోరుతున్నా - 'మురళీకృష్ణ')

కన్ను నీదని, వేలు నీదని పొడుచుకుంటే రాదా రక్తం
రక్తమెంతగా ధారపోసినా దొరుకుతుందా మళ్ళీ హృదయం
(మనసు లేని బ్రతుకొక నరకం - 'సెక్రటరీ')

వయసు కోతి వంటిదీయ మనసు కొమ్మ వంటిదీ
ఊపేసి పోతుంది మొదటిదీ,
ఆ ఊపు మరువనంటుంది రెండవది
(వయసు కోతి వంటిదీ - 'అగ్నిపూలు')

తనువుకు ప్రాణం కాపలా - మనిషికి మనసే కాపలా
ఎవరి ప్రేమకు నోచని నాడు కన్నీరేరా నీకు కాపలా
(ఎవరికి ఎవరు కాపలా - 'ఇంటికి దీపం ఇల్లాలే')

మనిషికి మనిషికి మమత కూడదా
మనసు తెలుసుకొను మనసే లేదా
(ఎవరో జ్వాలను రగిలించారు - 'డాక్టర్ చక్రవర్తి')

మనసు మూగదే కానీ బాసుంటది దానికి
చెవులుండే మనసుకే ఇనిపిస్తుందా ఇదీ
(ముద్దబంతిపూవులో - 'మూగమనసులు')

మడిసితోటి ఏలాకోలం ఆడుకుంటే బాగుంటాది
మనసుతోటి ఆడకు మావా ఇరిగిపోతే అతకదు మల్లా
(మాను మాకును కాను - 'మూగమనసులు')

వయసు పెరిగినా మనిషి ఎదిగినా
మనసు ముదరనంత వరకు మాసిపోదు పసితనం
(వయసు పెరిగినా - 'ప్రాణమిత్రులు')

ఒడ్డున పెరిగే గడ్డిపోచకు హృదయం ఎందుకు ఉండకూడదు
ఉందని ఎందుకు ఒప్పుకోరాదూ
మోడు కూడా చిగురించాలని మూగమనసు కోరే కోర్కెను
మోసం ద్రోహం అనడం అన్యాయం(అటు ఇటు కాని - 'ఇది కథకాదు')

విధి, సమాజం, ఖర్మ, బలహీనతలు వీటి పోకడల మీద ఆత్రేయ ఎన్నో విసుర్లు విసిరాడు. ఒక్కోసారి విరుచుకు పడ్డాడు. మరోసారి విజ్ఞత తెలియజెప్పాడు. అయితే ప్రతిసారీ బాధ్యతను గుర్తు చేశాడు. ఎలా అంటే -

కడుపు కాలే కష్టజీవులు ఒడలు విరిచీ
గనులూ తొలిచీ చెమట చలువను చేర్చిరాళ్ళను తీర్చినారు తెలుసుకో.
(కారులో షికారుకెళ్ళే - 'తోడికోడళ్ళు')

అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని
జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని
(నీ సుఖమే నేను కోరుతున్నా - 'మురళీకృష్ణ')

ఇరవైలో అరవై వయసు ఎవరికైనా వచ్చేనా?
(సిగలోకి విరులిచ్చి - 'సుమంగళి')

కళా జీవితం లక్కు ఒక ట్రిక్కు ఒకరికి లక్కు - ఒకరికి ట్రిక్కు
(ఓ బుచ్చిబాబు - 'నాటకాల రాయుడు')

తప్పు నాది కాదంటే లోకమొప్పుతుందా నిప్పులాంటి సీతనైన తప్పు చెప్పకుందా
(రాయిని ఆడది చేసిన - 'త్రిశూలం')

ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా ఆవేశం ఆపుకోని అమ్మానాన్నదే తప్పా
(సాపాటు ఎటూ లేదు - 'ఆకలిరాజ్యం')

పిచ్చిపిచ్చిపిచ్చి రకరకాల పిచ్చి
ఏ పిచ్చీ లేదనుకంటే అది అచ్చమైన పిచ్చీ
(పిచ్చిపిచ్చిపిచ్చీ - 'విచిత్ర వివాహం')

రాతి అందాలన్నీ నాతిలో చెక్కి
తీరని కోర్కెలే తీర్చుకున్నాడేమో
(ఆనాటి మానవుడు - 'సుమంగళి')

ప్రేమనేది ఉన్నదా
అది మానవులకే ఉన్నదా
హృదయముంటే తప్పదా
అది బ్రతుకు కన్నా గొప్పదా
(మనసులేని దేవుడు - 'ప్రేమలు - పెళ్ళిళ్ళు')

కర్మను నమ్మినవారెవరూ కలిమిని స్థిరమనుకోరు, కళ్ళు మూసుకోరు.
కావాలని నిప్పు తాకితే చేయి కాలక మానదు
అలా కాలినందుకు ఖర్మే అంటే గాయమేమీ మానదు.
(కనబడని చెయ్యి ఏదో - 'తాశిల్దారుగారమ్మాయి')

ప్రేమ, పెళ్ళి, రెండు హృదయాల పరస్పర స్పందనపై - ఆత్రేయ అందించిన అనుభూతి తల్చుకున్నప్పుడల్లా మనసు అట్టడగు అంచులు కూడా పులకరించిపోతాయి.

నీ వలపు వాన కురిసి కురిసి తడిసి పోనీ
తడియారని హృదిలో నను మొలకలెత్తనీ
(తెల్లవారనీకు ఈ రేయినీ - 'ఆత్మబలం')

జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకు పోతుంటే
(చిటపటచినుకులు - 'ఆత్మబలం')

పెమిదను తెచ్చి ఒత్తిని యేసి చమురును పోసి బెమసూసేవా
ఇంతా చేసి ఎలిగించేందుకు ఎనక ముందూలాడేవా
(మాను మాకును కాను - 'మూగ మనసులు')

నన్నిడిచి నువ్వెళితె నీ వెంట నేనుంట
నిన్నిడిచి నే వెళితె నువ్వ బ్రతకలేవంట
ఇది నీగొప్పా నాగొప్పా కాదు పిల్లోడా
ప్రేమంటే అంతేరా పిచ్చివాడా
(ఎక్కడికి పోతావు చిన్నవాడా - 'ఆత్మబలం')

ఇక పడుచుదనం, కుర్రతనం మీద ఆత్రేయ పంచకళ్యాణి గుర్రంలా ఎంతగా కదనుతొక్కిందీ, ఎంతగా పదనుచూసిందీ,

ఎంతమందిని వెర్రెక్కించిందీ చెప్పాలంటే ఆ ఉదాహరణలు కోకొల్లలు.

దోరవయసు, అలవికాని భారమయింది.
ఆ బరువు మోయలేక నడుము పలచబడింది.
(మిడిసి పడకు అత్తకుతురా - 'ఆస్తిపరులు')

బిగదీయకు బిగదీయకు పైట కొంగును
ఎంత బిగదీస్తే బిగువులన్నీ బైటపడేను

(ఓహోహో వయ్యారి - 'సుపుత్రుడు')

పడుచు పిల్ల పయ్యెదలా పలుచని వెలుగే పరిచినదీ
కొండల కోనల వలుపుల్లో కొత్త వంపులే చూపినదీ
(ఈ ఉదయం నా హృదయం - 'కన్నెమనసులు')

ఎవరో చెపితే విన్నాను విన్నది నీతో అన్నాను నాకూ ఇంతే తెలిసినదీ
నీకే తెలియును మిగిలినదీ
(ఎన్నో రాత్రులు వస్తాయి - 'తోడూనీడా')

తేటి ఎగిరిపోతుంది పువ్వు మిగిలిపోతుంది.
తేనె ఉన్న సంగతి తేటి గురుతు చేస్తుంది
(ఇదేనన్న మాట - కొడుకుకోడలు)

ఇది చదువుల్లో ఎక్కడా చెప్పలేదే
చెప్పందీ చేసినా తప్పుకాదే
(పడ్డావటే పిల్లా - 'బ్రతుకే ఒక పండుగ')

పడుచుదనం పందెమెత్తి వలపు జూదం ఆడుకోవాలి.
నాకు నువ్వు నీకు నేను రోజురోజూ ఓడిపోవాలి.
(వెచ్చవెచ్చనీ నీ ఒడిలో - 'శభాష్ వదినా')

నీలోని మగసిరితోటి నాలోని సొగసుల పోటీ
వేయించి నేనే ఓడి, పోనీ పొమ్మంటీ
నేనోడి నీవే గెలిచి నీ గెలుపునాదని తలచి
రాగాలే రంజిలు రోజే రాజీ రమ్మంటీ
(రేపంటి రూపం కంటి- 'మంచిచెడు')

మొదట మొదట కళ్ళతోటి మొదలు పెట్టి లడాయి.
హృదయమంత పాకుతుంది హుషారైన హాయి
కలకాలం ఉండదు ఈ పడుచు బడాయి
తొలినాడే చల్లబడి పోవునమ్మాయి
(గిల్లికజ్జాలు తెచ్చుకునే - 'ఆత్మబలం')

భగ్నప్రేమకు ఆత్రేయ తన పాటలతో ప్రాణం పోసి ప్రేక్షకులను కంటనీరు పెట్టించారు

కదిలే శిలగా మారిపోతిని కథగానైనా మిగలనైతిని

(నాలుగు కళ్ళు రెండైనాయి - 'ఆత్మబలం')

కనులున్నవి కన్నీటికి కొలనుల గుటకా
(బంగారు నావా బ్రతుకు - 'వాగ్దానం')

తొలికోడి కూతల్లె వినిపించి తొలిపొద్దు వెలుగల్లే కనిపించి
తొలిజన్మ ఋణమేదో అనిపించి తెరవని తలుపులు తెరిపించి
ఎందుకు వచ్చానో ఎందుకు వెళ్ళావో నాకేమో తెలియదు.
నీకైనా తెలుసునా
(ఎందుకు వచ్చానో - 'మనసు-మాంగల్యం')

అగ్గి వంటి వలపంటించి హాయిగా ఉందామనుకోకు
మనసు మంచి మనసుకి పాకి ఆరని గాయం చేస్తుంది.
రాయికన్నా రాయిని నీవు కసాయిని నీవు
(హృదయం లేని ప్రియురాలా - 'కన్నెమనసులు')

నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి
ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసునా
(ముంద్దబంతి పూవులో - 'మూగ మనసులు')

చావు పుటక లేనిద్మ్మ నేస్తమన్నదీ
జనమ జనమకది మరీ గట్టిపడతదీ
(పాడుతా తీయగా చల్లగా - 'మూగ మనసులు')

మాటలతో, పదాలతో ఆత్రేయ పడలాస్యం చేశారు

అందుకే నేనది పొందినది అందనిదైనా అందనిది.
పొందిన పిదపే తెలిసినదీ నేనెందుకు నీకు అందినది
(అందరికీ తెలియనదీ - 'ఆస్తిపరులు')

సరిగమ వానికి సగమని తలపోయి
మురిపాలె మన జంట స్వరమైనవి
(ఏ రాగమూ ఇది ఏ తాళమూ - 'అమరదీపం')

వచ్చింది ఎందుకో తెలిసుంటే వెళ్ళవు
వెళ్ళేది తెలిసుంటే అసలొచ్చి ఉండవు
(ఎందుకు వచ్చావో - 'మనసు- మాంగల్యం')

ఇదిలా ఉండగా 'తొలికోడి కూసింది' చిత్రంలో 'పోలిసు వెంకటసామి నీకు పూజరయ్యాడు' పాటలో పూర్తిగా పోలీసు భాషనే ఉపయోగించారాయన.

ఉదహరించాలంటే - పాట మొత్తాన్ని రాయాల్సిందే. అలాగే 'అదృష్టవంతులు' సినిమాలో 'నమ్మరే నేను మారానంటే నమ్మరే' పాటలో సాహిత్యం అంతా ఓ డైలాగు చెప్తున్నట్టే ఉంటుంది.

ఎన్నో చిత్రాలకి ఆయన సంభాషణలు రాసి వాటికి ప్రాణ ప్రతిష్ట చేసారు
ఉదాహరణకి ...................

''ఎవ్వరికీ ఇవ్వనంత వరకే హృదయం విశాలంగా ఉంటుంది.

ఒకసారి ఇచ్చాక ఇరుకై పోతుంది ఇంకెవ్వరికీ చోటివ్వనంటుంది''

''చినబాబు చెడిపోయాడేమో గాని చెడ్డవాడు మాత్రం కాదమ్మా''

''మనిషి తాను అనుకున్నట్టు బ్రతకనూ లేడు ఇతరులు అనుకున్నట్టు చావనూ లేడు''

''వీటన్నిటినీ భరించాలంటే అసలు మనిషి మీద ప్రేమ ఉండాలి''

" నేను చెడిపోయిన వాళ్ళను చేరదీశానేమో గానీ నాకు నేనుగా ఎవ్వరినీ చెడగొట్టలేదు "

" ఒకటి మీ డబ్బు ఇంకొకటి నా రాజీనామా - అంటే ఒకటి నా అధికారం ఇంకొకటి నీ అహంకారం ... అవునా ?"

" పిరికివాడెక్కడ చస్తాడు లతా ... పిరికివాడు జీవితాన్ని ప్రేమిస్తాడు. గుండె గలవాడు ప్రేమని ప్రేమిస్తాడు, త్యాగాన్ని ప్రేమిస్తాడు. రెండూ ఫలించని నాడు మరణిస్తాడు"

"అంతరాత్మ గొంతు ఎంతకాలం నులిమేస్తావు ? "

" సరే ... నువ్వు నీ అహంకారాన్నే కాపాడుకో ... ఎదో ఒక రోజు అది ఆత్మీయత కోసం అలమటిస్తుంది "

"నేనంటే ఏమిటో తెలియనిదాన్ని నాక్కావల్సిందేమిటో ఎలా తెలుస్తుంది ?"

" తెలుసుకున్నాక తెంచుకోవడం తేలిక "''(ప్రేమనగర్)''

''సామాన్యుడికి అందుబాటులో లేని కళ సంకుచితమై సమసిపోతుంది''
(జయభేరి)

''చావు ఎంతమందినో విడదీస్తుంది కాని కొంతమందిని కలుపుతుంది''
(మూగమనసులు)

''కన్నీరే మనిషిని బ్రతికించగలిగితే అమృతం లాగే అదీ కరవైపోయేది''

''చంద్రుడు క్షీణిస్తున్నాడని వెన్నెల వేరే చోట వెతుక్కుంటుందా?''

''కవిత్వం వేరు, జీవితం వేరు. విలువలు తెలుసుకుంటే జీవితమే ఓ మహాకావ్యం అవుతుంది''
(''వెలుగునీడలు'')

ఇలా ఎన్నో ఎన్నో ఎన్నెన్నో .

సూళ్ళురుపేట మంగళంపాడులో 1921వ సంవత్సరం మే ఏడవ తేదీన జన్మించారాయన. మే ఏడవ తేదీ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మదినం. 'నిజమా?' అని అడిగితే 'అవును... కావాలనే ఆ తేదీ చూసుకు మరీ పుట్టాను' అంటుండే వాడాయన సరదాగా.
చిన్నప్పుడు చదువు మీదకన్నా, నాటకాల మీదనే ఎక్కువ శ్రద్ధ చూపించేవాడు. ఓసారి ఓ నాటకంలో మీసాలు గొరిగించుకుని నటించాడని ఇంటికి వచ్చాక గోమూత్రం తాగించి ప్రాయశ్చిత్త సంస్కారం చేశారు. అంత సంప్రదాయబద్ధమైన కుటుంబం ఆయనది. ఆత్రేయ అసలు పేరు కిళాంబి వెంకట నరసింహాచార్యులు. గోత్రనామం ఆత్రేయ కనుక ఆ పేరునే తన పేరుగా ధరించాడాయన.
ఓసారి ఓ మిత్రుడు ఆయనకి తను రాసిన కందపద్యాలు తెచ్చిచూడమన్నాడు. ఆత్రేయకు అర్ధం కాలేదు. 'ఏం చేయాలి' అని అడిగాడు మేనమామని. ఆయన కందపద్య లక్షణాలున్న ఓ పుస్తకాన్ని ఆత్రేయకి ఇచ్చి చదివి వంటపట్టించుకోమన్నాడు. ఆత్రేయ ఆ లక్షణాలన్నీ ఆకళింపు చేసుకుని - 'నువ్వు చేసిన తప్పులు ఇవీ' అని ఆ మిత్రుడికి అతని తప్పుల్ని కంద పద్యంలోనే రాసి చూపించాడు.
ఇది తెలుసుకున్న ఆత్రేయ మేనమామ 'ఒరే ....నువ్వు స్కూల్ ఫైనల్ పాసైతే నీకు సైకిల్, రిస్ట్_వాచీ, కొనిస్తాను' అన్నాడు. అంతే... వెంటనే మిత్రుల దగ్గరకెళ్ళి పాఠ్యపుస్తకాలన్నీ కాపీ చేశాడు ఆత్రేయ. అలా రాస్తుండగానే సగం పాఠాలు ఆయనకి కంఠోపాఠంగా వచ్చేశాయి. స్కూల్ ఫైనల్ పాసై మేనమామ ఇచ్చిన రిస్ట్_వాచీ పెట్టుకుని సైకిలెక్కి ఊరంతా గర్వంగా తిరిగాడు.
అయినా సరే 'నాలైను వేరే ఉంది' అని ఎప్పుడూ అనుకునేవాడు మనసులో. ఒకసారి రాజన్ అనే మిత్రుడి సాయంతో ఇంట్లోని వెండిగ్లాసు దొంగిలించి మద్రాసు బండెక్కాడు.
అక్కడ పడరాని అగచాట్లు పడ్డాడు. సబ్బులు అమ్మేవాడు. ఉన్ననాడు భోజనం - లేనినాడు కుళాయి నీళ్ళు. రాత్రిళ్ళు మద్రాసులోని మన్రో విగ్రహం దగ్గర పడుకునేవాడు. ఓసారి ఓ పావలా ఎక్కువ ఉందనిపిస్తే ఓ నోటుబుక్ కొని వీధి దీపం కింద కూర్చొని 'గౌతమబుద్ధ' అనే నాటకం రాసి యాభై రూపాయలకు అమ్మాడు. ఆ రోజుల్లోనే సినీనటుడు రమణారెడ్డితో పరిచయం ఏర్పడింది. టిఫెనుకీ, భోజనానికీ, పావలా, బేడా రమణారెడ్డి ఇచ్చేవాడు ఆత్రేయకి.
ఇలా ఉండగా 'తెనాలి రామకృష్ణ సినిమాలో వేషం ఉంది వేస్తావా' అని అన్నాడో పరిచయస్తుడు. సరేనని వెళ్ళి అక్కడ పడేసిన గుడ్డలు, బకెట్_లో వేసుకోవలసిన రంగునీళ్ళు చూసి నచ్చక వెనక్కి వచ్చేశాడు.
ఆ తర్వాత 'షావుకారు' చిత్రంలో డైలాగులు రాయడానికి కుదిరాడు. కానీ ఆరోగ్యం సహకరించక ఆయనే ఒద్దనుకున్నాడు. కొన్నాళ్ళకు 'మనోహర' చిత్రంలో డైలాగ్ అసిస్టెంట్_గా మాట సాయం చేశాడు. ఎట్టకేలకి 'దీక్ష' చిత్రంలో 'పోరాబాబు పో' పాట రాసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఇక ఆయన చేతికి విశ్రాంతే లేకుండా పోయింది.
కొన్ని వందలు, వేలు పాటలు, మాటలు రాసిన ఆత్రేయ దర్శకుడిగా 'వాగ్దానం' చిత్రానికి దర్శకత్వం వహించాడు. నటుడిగా'కోడెనాగు' చిత్రంలో నటించాడు. ఆత్రేయ మంచి హ్యూమనిస్టే కాదు, చక్కని హ్యూమరిస్ట్ కూడా!

ఓసారి ఓ సినిమా హాల్లోంచి బైటికి వస్తున్న ఆత్రేయను చూసి ఆశ్చర్యపోతూ 'ఆత్రేయగారూ మీరు సినిమా చూశారా?' అని అడిగాడీ వ్యాసకర్త. అంత చెత్త సినిమా అది. దానికి ఆత్రేయ 'లేదు నాయనా... భరించా' అన్నాడు తడుముకోకుండా
మరోసారి ఆత్రేయ ఒక రైటర్ కి తన అడ్రసుని రాసి ఇచ్చేడు. అది చూసి అతను 'అరె... ఇది సుశీలగారు ఉండే వీధే కదండీ... ఆవిడ మీ ఇంటికి దగ్గరేనా?' అని అడిగాడు. 'అవును... ఇది వరకు ఆవిడ మా పక్కింటి అమ్మాయి,ఇప్పుడు ఎదురింటి అమ్మాయి' జవాబిచ్చాడు ఆత్రేయ చమత్కారంగా.
'అంటే.... ఆవిడ మారేరా.. మీరు మారేరా?' తిరిగి ప్రశ్నించాడీ రైటర్
'మారేదెప్పుడు ఆడవాళ్ళే... ఊ...ఊ....ఊ....మ్మగమాళ్ళు మారరు' అని అన్నాడు ఆత్రేయ అక్కినేని నాగేశ్వరరావుగారిని ఇమిటేట్ చేస్తూ.
ఆత్రేయ అంటే చంద్రుడు అని అర్థం. అది తెలియని ఒకాయన 'ఆత్రేయ అంటే ఏమిటండీ?' అని అడిగాడు. దానికి ఆత్రేయ సమాధానం - రాత్రేయుడు'.
ఆత్రేయ 'వాగ్దానం' చిత్రానికి డైరెక్ట్ చేసే రోజుల్లో ఓసారి సెట్_లో అక్కినేని నాగేశ్వరరావుగారితో సహా అందరూ రెడీ అయి కూర్చున్నారు. ఆత్రేయ మాత్రం ఎక్కడా అయిపులేడు. ఆఖరికి అక్కినేని అటూ ఇటూ తిరిగి ఆత్రేయని పట్టుకున్నారు. ఎవరికీ కనిపించకుండా ఓ మూల కూర్చుని అప్పుడు చిత్రీకరించవలసిన డైలాగులు రాసేసుకుంటున్నాడాయన. 'ఏంటండీ ఇది.... ఏంటీ పని?'' అని మందలించారు అక్కినేని.
''అదికాదు నాగేశ్వరరావు గారూ... అందరికీ లేటుగా ఇచ్చి నా సినిమాకి నేను ముందుగా డైలాగులు రాసేసుకుంటే'స్వార్ధం' అని ప్రొడ్యూసర్లు తిట్టుకోరూ... ఆ పార్షియాలిటీ లేకుండా జాగ్రత్త పడుతున్నానండీ'' అన్నాడాయన వస్తున్న నవ్వుని ఆపుకుని సీరియస్ గా

అందరి మనసులను దోచుకున్న ఈ మనసు కవి 1989,సెప్టెంబర్ 13 న స్వర్గస్తులయ్యారు.

శశిబాల
ధనమేరా అన్నిటికి మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం
ధనమేరా అన్నిటికి మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం
ధనమేరా అన్నిటికి మూలం

మానవుడే ధనామన్నది స్రుజియించెనురా దానికి తనే తెలియని దాసుడాయెరా
మానవుడే ధనామన్నది స్రుజియించెనురా దానికి తనే తెలియని దాసుడాయెరా
ధనలక్శ్మిని అదుపులోన పెట్టినవాడే
ధనలక్శ్మిని అదుపులోన పెట్టినవాడే
గుణవంతుడు బలవంతుడు భగవంతుడురా

..ధనమేరా అన్నిటికి మూలం..

ఉన్ననాడు తెలివికలిగి పొదుపుచేయరా లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా
ఉన్ననాడు తెలివికలిగి పొదుపుచేయరా లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా
కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే
కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే
హయ్యో కూలి పోవు కాపురాలు ఇది తెలియకుంటే..

ధనమేరా అన్నిటికీ మూలం
కూలివాని చెమటలో ధనమున్నదిరా
పాలికాపు కండల్లొ ధనమున్నదిరా
కూలివాని చెమటలో ధనమున్నదిరా
పాలికాపు కండల్లొ ధనమున్నదిరా
శ్రమజీవికి జగమంతా లక్శ్మీనివాసం
శ్రమజీవికి జగమంతా లక్శ్మీనివాసం
ఆ శ్రీదేవిని నిరశించుత తీరని ద్రొహం

ధనమేరా అన్నిటికి మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం

11, మార్చి 2017, శనివారం

సీ.కారణజన్ముడు కనుకనే అమరావతి నిర్మాణ రాజస తేజుడయ్యె. కారణజన్ముడు కాననే క్రిష్ణను గోదారి సంధింప సాధ్యమయ్యె. కారణజన్ముడు కాననే పోలవరజలాభిషేకాభి రాముడయ్యె. కారణజన్ముడు కాననే త్యాగంబు సలిపిరి రైతులు శంకలేక.           గీ. నింద వేయుటే ప్రతిపక్ష నియమమైన ప్రజల సంక్షేమ కర్తవ్య ప్రతిన మేర.   సకల వర్గాల ప్రజలను సమముజూచు చంద్రబాబన్నె మన నేత శాశ్వతముగ.
చిన్నప్పటి మన ఇరుకిరుకు  ఇళ్లు...
ఆనందాలు  క్రిక్కిరిసిన అందాల  జ్ఞాపకాల పొదరిళ్లు...

సరిపోవడం లేదిప్పుడు ఒక్కొక్కడికీ రెండు మూడిళ్ళు...
ఐనా సరే శరీరానికి కాక మనసుకు పడిపోతున్నాయ్ డిప్రెషన్, టెన్షన్ల పుళ్లు...

వదిలేసి వచ్చాక సంపాదిద్దామని నాలుగు రాళ్లు...
మరచిపోతున్నామిప్పుడు బతుకునిచ్చిన  ఊళ్లు...

సవాలక్ష కారణాలతో వాళ్లు వెళ్ళారని వీళ్లు,వీళ్లు వెళ్లారని వాళ్లు...
అలా వలసలు పెరిగి కళ తప్పిపోతున్నాయ్  పల్లెటూళ్ళు...

మహ గడుసువారండీ కొత్తతరం కోడళ్లు...
సిటీకి మారతానన్నాకే వేయించుకుంటున్నారు మూడు ముళ్ళు...

మొదలయ్యాక గానీ  నొప్పుల కీళ్ళు...
గుర్తుకు రావేమో జన్మనిచ్చిన ఊళ్లు...

నెత్తికెక్కి పూర్తిగా  కళ్లు...
పండక్కెళ్లడాన్నికూడా వాయిదా వేసేస్తున్నాం ఏళ్లకేళ్లు...

పొట్ట రావడమే కాదు నిజంగానే బలిసిందేమో ఒళ్లు...
అందుకే బద్ధకంతో గడిపేస్తున్నాం వెళ్లకుండా  ఏళ్లూ పూళ్ళు...

ఒక్కసారి గుర్తుకొచ్చాయా మనం చదివిన  ఆ స్కూళ్లు...
భూమ్మీద ఆగవింక  మన కాళ్లు...

ఇరవై ఎక్కాలు ఇరవైల దాకా చెప్పడంలో అప్పుడు మనం లేళ్లు...
తేడా వస్తే వెనక్కి తిప్పి కొట్టేవారు వేళ్ళు...

మందమయిపోయాయిప్పుడు మన మెదళ్ళు...
సెల్ఫోన్ కాలిక్యులేటర్లో చూస్తున్నామిప్పుడు ఎంతోనని రెండు మూళ్ళు...

కొరికినట్టు కనబడితే గోళ్ళు...
మాస్టారిచేతిలో అనేది చెంప ఛెళ్లు...

గుర్తున్నాయా పబ్లిక్ పరీక్షలు పదులూ, ఏళ్లు...
మరచిపోడం ధర్మమా ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఆయన చేసిన మేళ్ళు...

తన పిల్లల చదువును, భవిష్యత్తును పణంగా పెట్టి మాస్టారు మనసులో లేకుండా కుళ్లు...
డేగలా కాస్తూ చదివించేవారు దాటేదాకా అర్థరాత్రుళ్లు...

అప్పుడనిపించేవి అవి కాళరాత్రుళ్లు...
ఇప్పుడు పెడుతున్నాయి మనకూ,బిడ్డలకూ కూళ్ళు...

ఒక్కసారి ఆయనింటికెళ్ళు...
బ్లాక్ బోర్డు లాంటి మన బుర్రలో తెల్లని జ్ఞానాన్ని నింపిన బస్తాలకొద్దీ చాక్ పౌడర్ ఎఫెక్ట్ తో టీబీ వచ్చి దగ్గుతున్నారేమో అవసానదశలో ఖళ్ళూ ఖళ్లు...

గుర్తున్నాయా ఇంట్లోనే పెంచిన గేదెలూ, కోళ్లు...
వేసవిసెలవుల్లో ఆడిన అష్టాచెమ్మా, వైకుంఠపాళి గళ్ళు...

మామిడి కాయల దొంగతనాల కోత గాళ్లు...
కాపు కాసేవాడు చూస్తే చాలు వెనక్కు తిరక్కుండా పరుగెత్తేవాళ్ళు...

కులమతభేదాలెరగక నేస్తాలతోపాటు తిరిగాం చర్చిలు,మసీదులూ గుళ్ళు...
ఇప్పుడు అల్లుకున్నాం ఒకరికొకరం కలవలేని వనభోజనాలక్కూడా కులమతాల సాలె గూళ్ళు...

జంతికలూ, పప్పు బెల్లాలే కదా మనకు తెలిసిన చిరు తిళ్ళు...
మహదానందంతో చప్పరించేవాళ్లం చాక్లెట్లు కొనలేక జీళ్ళు...

ప్రతీరోజూ చెట్టెక్కి మరీ కోసేవాళ్లం జాంపళ్లు...
ఫ్రూట్సంటే తెలిసిందొకటే బయటకొనే అరటి పళ్ళు...

ఎర్రటి ఏప్రిల్ ఎండలో తార్రోడ్డు పై కాల్తున్నా కాళ్లు...
చెట్ల నీడల్లో ఆగుకుంటూ వెళ్ళేవాళ్ళం కొనే స్థోమత లేక జోళ్ళు...

అప్పుడు మా బ్యాచ్ అంతా ఏడిపించేవాళ్ళు...
ఇద్దరు ముగ్గురమున్నామని మరీ పొట్టి పిల్లోళ్ళు...

ఇప్పుడనిపించుకుంటున్నాం  పొడుగాటోళ్లు...
హైటులోనే కాదు తవికలు కూడా రాసేస్తున్నాం మైళ్లకుమైళ్లు...

చిన్నప్పటి  వరసల అల్లరి బావా మరదళ్ళు...
గుర్తొచ్చాయంటే అవి, మనసెంతో ఆనందంతో తుళ్లు...

ఆరుబయట మంచమేస్తే చందమామనూ,చుక్కలనూ చూస్తుంటే నిద్రపట్టేసేది లేకుండానే దుప్పట్లూ, దిళ్లు...
ఇప్పుడు ఏసీ ఇరవైలో ఉన్నా కలత నిద్రే నూటికి నూరు పాళ్లు...

ఎప్పుడయినా చూడాలంటే తిరునాళ్ళు...
దాటి వెళ్లాల్సొచ్చేది ఐదూళ్ళు...

తిరుగు ప్రయాణంలో పొలిమేర దాటగానే దెయ్యాల భయంతో గుంపులు గుంపులుగా యమజోరుగా  తొక్కేవాళ్లం సైకిళ్లు...
భయం పోగొట్టుకోడానికి పాటలు పాడుకుంటూ చేరుకునే వాళ్లం అర్థరాత్రిళ్ళు...

ఒకోసారి నాటకాలు, రికార్డింగ్ డాన్సులు,ఆర్కెస్ట్రాలు వదల్లేక తెల్లారిపోయేది భళ్లు...
ఆనక నాన్న చేతిలో వలిపించుకునేవాళ్లం తోళ్లు...

చుండ్రనే పదం తెలీనీకుండా కాపాడిన, వారానికోసారి బ్రహ్మ ప్రళయం తెచ్చే కుంకుళ్లు...
మరచిపోయి అయ్యింది ఎన్నేళ్ళు...

మధ్యలో వాటిని వదిలేసినందుకు గిఫ్ట్ గా వచ్చిన  బట్టతలపై ప్రతీరోజూ జార్చేస్తున్నాం షాంపూ నీళ్లు...
పిల్లలకూ అలవాటు చేయడం వలన టీనేజిలోనే తెల్లవెంట్రుకల బారిన పడిపోతున్నారు మన బుడ్డోళ్లు...

సీజనొచ్చిందా మొదలయ్యేయి పెళ్ళిళ్ళు...
పక్కూరికైనా కట్టేవాళ్ళు వరసగా ఎడ్ల బళ్ళు...

ఎక్కడ చూసినా ఉండేయి పచ్చిక బైళ్ళు...
చూసేకొద్దీ చూడాలనిపించేవి వరి నారు మళ్లు...

రియల్ వ్యాపారంతో అయిపోతున్నాయవిప్పుడు బీళ్లు...
పచ్చిగడ్డి,ఎండు గడ్లకోసం పాడి పశువులు జాలిగా తెరుస్తున్నాయి నోళ్లు...

గుర్తుకు తెచ్చుకోండి  మొదటి సినిమా చూసిన టూరింగ్ సినిమా హాళ్లు...
నేల టికెట్ కెళ్లి అక్కడ పరచిన ఇసుకలో ఆడిన గుజ్జన గూళ్లు...

ఇప్పుడు కేరాఫ్ అడ్రస్ వీకెండ్లో మాళ్ళు...
ఉసూరుమంటూ తలనొప్పితో  మళ్లెప్పుడూ పోకూడడదంటూ శపథాలు పడుతూ   తీస్తున్నాం పార్కింగ్ లోంచి బళ్లు...

నెలకోసారైనా వెనక్కెళ్లి తిప్పండి ఆ రీళ్ళు...
ఆ జ్ఞాపకాలే రక్షిస్తాయి కాకుండా మన జీవితాల్ని మోళ్లు...

సరదాగా మొదటిసారి ఎక్కిన రైళ్లు...
పట్టాలపై నాణేలు పెట్టి రైలెళ్లిపోయాక సంబరంతో  అవి తీసి దాచుకున్నాం  ఏళ్లు...

చదూతూ పోతోంటే తిరుగుతున్నాయా జ్ఞాపకాల సుళ్ళు...
చూస్తారే  వేసుకోండిక కమెంట్ల వీరతాళ్లు...

8, మార్చి 2017, బుధవారం

ఓ మూడేళ్ళ కిందట రాసుకున్నా........

దేవుని పక్కకు నెట్టు. అమ్మకు దణ్ణం పెట్టు
అమ్మకు పెట్టిన దణ్ణమే నీకు అన్నం పెట్టు.
అమ్మను చదివితే అవనిని చదివినట్లే..
ఇక కవితలు, కావ్యాలు, ఇతిహాసాలు వృధా..

7, మార్చి 2017, మంగళవారం

మహిళో రక్షతి రక్షితః

కం.తల్లికి  బుడుతై పుడుతూ
     తల్లినొడిననుగ్గు భాష తోడ బెరిగి యా
     తల్లిన్ వృద్ధాశ్రయమున
     తల్లాడ్దుర్గతి జగతిన దాపురమయ్యెన్ !!
Amanikrishna
"భగమంతుని సేతిలో
బాససేసి సెప్తున్నా
బతికి నంతకాలమూ
జాతికి అంకితమౌతా
నీతికి కంకణ మౌతా "
••••••@గుడిసేవ

21, ఫిబ్రవరి 2017, మంగళవారం

ఎవడయ్య వాడు తెలుగువాడు..
---------------------
శాతవాహనుల వంశాన పుట్టిన వాడు
కాకతీయుల పోతుగడ్డ మెట్టినవాడు
పల్లెలోనే కాదు డిల్లీలో సైతమ్ము
పెద్దగద్దేలనేలి పెరుకేక్కినవాడు
ఎవడయ్య ఎవడు వాడు ఇం
కెవడయ్య తెలుగువాడు.!

పంచె కట్టుటలో మొనగాడు
కండువాలేనిధే గడపదాటని వాడు
పంచబక్ష్యాలు తన కంచాన వడ్డించ
గోంగూర కోసమై గుటకలేసువాడు
ఎవడయ్య ఎవడు వాడు ఇం
కెవడయ్య తెలుగువాడు.!

నేల నల్దేసల డేరాలు నాటినవాడు
అన్ని మూసలలోన అట్టే ఒదిగినవాడు
"ఎ దేసమేగిన ఎందుకాలిడినా"
ఆవకాయ వియోగామసలె సైపని వాడు
ఎవడయ్య ఎవడు వాడు ఇం
కెవడయ్య తెలుగువాడు.!

మంచి మనసెదురైన మాలలిచ్చేవాడు
భాయీ భాయీ అన్న చేయి కలిపేవాడు
తిక్కరేగిందంటే డొక్కా చీల్చేవాడు
చిక్కులెరుగని వాడు చిత్తాన పసివాడు
ఎవడయ్య ఎవడు వాడు ఇం
కెవడయ్య తెలుగువాడు.!

-------- డాక్టర్ సి.నారాయణ రెడ్డి

18, ఫిబ్రవరి 2017, శనివారం

సప్తాశ్వ రధమారూఢం, ప్రచండం,కశ్యపాత్మజం
శ్వేతపద్మధరం, దేవం, తం సూర్యం ప్రణమామ్యహమ్.
భర్తృహరి--శశికళ?  :D :D

అబ్బే,  భర్తృహరి ఆమెను దృష్ఠిలో పెట్టుకుని వ్రాయలేదు.

 ఒకచో నేలను బవ్వళించు, నొకచోనొప్పారు బూసెజ్జపై
నొకచోశాకములారగించు, నొకచో నుత్కృష్ట శాల్యోదనం
బొకచో బొంత ధరించు, నొక్కొకతఱిన్ యోగ్యాంబరశ్రేణి, లె
క్కకు రానీయరు కార్యసాధకులు కష్టంబున్ సుఖంబున్ మదిన్.

10, ఫిబ్రవరి 2017, శుక్రవారం

@ఘంటసాల @

జానపదమొకండు జనులు మెచ్చగ పాడు
      పద్యంబు నొక్కండు పాడగలడు
లలిత గీతమొకడు లయబద్దముగ బాడు
      శ్లోకంబు కొక్కడు శోభదెచ్చు
శాస్త్రీయమొక్కడు  శ్రావ్యంబుగా పాడు
      కీర్తనలనొకండు కీర్తిబొందు
భక్తి గీతమొకడు రక్తిగా పాడును
      పాశ్చాత్యమొక్కడు పలుకగలడు

ఎట్టిపాట గాని యే శ్లోకములు గాని
పద్యమైన మరియు గద్యమైన
నవరసంబు లొలుకు నాయాసమే లేక
ఘంటసాల వారి గళమునందు.

(సేకరించిన పద్యము)

8, ఫిబ్రవరి 2017, బుధవారం

పోస్ట్ పూర్తిగా చదివి అప్పుడు లైక్ చేయండి
'ఆ రోజులే బాగున్నాయ్' !
.....................................
టెన్షన్లు..
ఒత్తిళ్లు...
డబ్బు సంపాదన...
అతిగా ఆలోచనలు లేకుండా...
ఉన్నంతలో కుటుంబమంతా కలసి...
ఆనందంగా గడిపిన .
#ఆ రోజులు బాగున్నాయ్..!
ఆదివారం
ఆటలాడుతూ...
అన్నాన్ని మరచిన
#ఆ రోజులు బాగున్నాయ్..!
మినరల్ వాటర్ గోల లేకుండా...
కుళాయి దగ్గర,
బోరింగుల దగ్గర,
బావుల దగ్గర...
నీళ్లు తాగిన...
#ఆ రోజులు బాగున్నాయ్..!
ఎండాకాలం
చలివేంద్రాల్లోని చల్లని నీళ్లకోసం..
ఎర్రని ఎండను సైతం
లెక్కచేయని...
#ఆ రోజులు బాగున్నాయ్..!
వందలకొద్దీ చానెళ్లు లేకున్నా...
ఉన్న ఒక్క దూరదర్శన్ లో
శుక్రవారం చిత్రలహరి...
ఆదివారం సినిమా కోసం వారమంతా...
ఎదురు చూసిన
#ఆ రోజులు బాగున్నాయ్..!
సెలవుల్లో
అమ్మమ్మ..
నానమ్మల ఊళ్లకు వెళ్లి...
ఇంటికి రావాలనే ఆలోచన లేని...
#ఆ రోజులు బాగున్నాయ్..!
ఏసీ కార్లు లేకున్నా
ఎర్రబస్సుల్లో...
కిటికీ పక్క సీట్లో నుండి
ప్రకృతిని ఆస్వాదించిన
#ఆ రోజులు బాగున్నాయ్...!
మొబైల్ డేటా గురించి ఆలోచించకుండా...
బర్త్ డే డేట్ గురించి మాత్రమే ఆలోచిస్తూ...
చాక్లెట్లు పంచిన
#ఆ రోజులు బాగున్నాయ...
ఇప్పుడు జేబు నిండా కార్డులున్నా...
పరుసు నిండా డబ్బులున్నా...
కొట్టుకు పంపితే ...
మిగిలిన చిల్లర కాజేసిన
#ఆ రోజులే బాగున్నాయ్..!
సెల్లు నిండా గేములున్నా...
బ్యాట్ మార్చుకుంటూ
ఒకే బ్యాట్ తో క్రికెట్టాడిన..
#ఆ రోజులే బాగున్నాయ్...!
ఇప్పుడు బీరువా నిండా జీన్సు ప్యాంట్లున్నా...
రెండు నిక్కర్లతో బడికెళ్లిన...
#ఆ రోజులే బాగున్నాయ్..!
ఇప్పుడు బేకరీల్లో కూల్ కేకులు తింటున్నా... .
ఐదు పైసల ఆశా చాక్లెట్ తిన్న...
#ఆ రోజులే బాగున్నాయ్...!
చిన్న చిన్న మాటలకే దూరం పెంచుకుంటున్న ఈ రోజుల్లో..
పిల్లలం కొట్టుకున్నా
పెద్దలంతా కలసివుండే
#ఆ రోజులే బాగున్నాయ్..!
ఇప్పుడు ఇంటినిండా తినుబండారాలున్నా...
నాన్న కొనుక్కొచ్చే ...
చిరుతిళ్ళ కోసం ఎదురు చూసిన..
#ఆ రోజులే బాగున్నాయ్..!
ఇప్పుడు రకరకాల
ఐస్ క్రీమ్ లు చల్లగా నోట్లో నానుతున్నా...
అమ్మ చీరకొంగు పైసలతో
పుల్ల ఐసు కొనితిన్న...
#ఆ రోజులు ఎంతో బాగున్నాయ్..!
పొద్దుపోయేదాకా
చేలో పని చేసుకొచ్చి...
ఎలాంటి చీకూచింత లేకుండా..
ఎండాకాలంలో ఆకాశంలోని
చందమామను చూస్తూ నిదురించిన..
#ఆ రోజులు బాగున్నాయ్..!
#ఆ రోజులు బాగున్నాయ్..
#ఆ రోజులు ఎంతో బాగున్నాయ్...
*ఉమ్మడి కుటుంబాల ఊసే లేకుండా పోయింది.
అమ్మ, నాన్న,....
అక్క బావ...
చెల్లి మర్ది....
అన్న వదిన....
తమ్ముడు మర్దలు....
మేనత్త మేనమామ....
పిన్ని బాబాయ్.....
పెద్దమ్మ పెదనాన్న....
తాతయ్య అమ్మమ్మ....
తాతయ్య నానమ్మ.....
ఒదిన, మరదలు....
బావ బామ్మర్ధి.....
ఇంకా....
ముత్తాత తాతమ్మ....
ఇలా వరుసలు ఉన్నాయని.... ఉంటాయన్న సంగతే మరిచారు నేటి తరం....
మమ్మి డాడి..... ఆంటీ అంకుల్
ఇవి రెండు తెలిస్తే చాలు....
ప్రపంచమంతా మన బందువులే అనే భావన ఏర్పడింది.
రక్త సంభందం అంటే ఏంటో తెలియని దుస్తితి....
కారణం.....
పుట్టగానే పిల్లలను క్రెచ్చ్ ల్లో వేయడం....
లేదా ఆయాలకు అప్పగించడం...
అందాలకు బందీలై తల్లి పాలు కూడా ఇవ్వకపోవడం....
ముడ్డి కడగడం మానుకొని డైపర్స్ వాడడం....
ఇంకెక్కడి ప్రేమలు... లాలనలు....
ఇక్కడినుండే మొదలు....
ఇక కాన్వెంట్లు..... రెసిడెన్సు స్కూళ్లు....
వాడికి ఎవడు చుట్టమో... ఎవడు పక్కమో తెలియని పరిస్థితి ....
ఎద్దులా పెరిగి మొద్దులా తయారవడం తప్ప మరేమీలేదు....
ఇంజనీరింగ్ చేయడం....
ఎమ్మెస్ కని విదేశాలకు వెళ్ళడం.....
వాట్సాప్ లో చాటింగ్....
ఐ ఎం ఓ లో విజిటింగ్....
స్కైప్ లో వీడియో కాలింగ్....
అమేజాన్ ద్వారా షాపింగ్....
నెలకింత అమ్మ నాన్నలకు డబ్బు పంపిస్తే.... వీరికదే ఆనందం....
పెళ్లి ముందురావడం.... అయిపోగానే పెళ్ళాన్ని తీసుకొని పోవడం.....
ఇంకెక్కడి ప్రేమలు... ఆప్యాయతలు....
అయ్యా, అమ్మ సస్తే తప్ప....
కనీసం దాయాదులు పోయినా....
దగ్గరోడు సచ్చినా....
దయలేని దుస్థితి ....
చూడలేని పరిస్థితి ....
ఇంకెక్కడి బందాలు....
ఇంకెక్కడి బందుత్వాలు....
అందుకే....
కుటుంబ వ్యవస్థ రోజు రోజుకు నశించిపోతుంది....
అందుకే రోజు రోజుకు ఓల్డ్ ఏజ్ హోం ల సంఖ్యలు పెరుగుతూ పోతున్నాయి.....
బాల్యం నుండే మార్పు రావాలి...
బందాలు పెరగాలి....
అమ్మమ్మ, నానమ్మ ల కథలు వినాలి....
తాతయ్య నేర్పే మర్యాదలు నేర్పాలి....
కుటుంబం లో ఉండే ఆనందం తెలపాలి....
అది మనింటినుండే ప్రారంభం కావాలి....
కలసి బోజనం చేసి.... కలసి ముచ్చటించడం నేర్పాలి....
ఉమ్మడి కుటుంబ వ్యవస్థను కాపాడి....
మళ్ళీ ప్రపంచానికి మన దేశం వసుదైక కుటుంబం అని చాటి చెబుదాం....

Courtesy Akhila bharata sakhaharabhojana sangham group

6, ఫిబ్రవరి 2017, సోమవారం

దినముగడచుకొలది దిగజారునందము
వయసుపెరుగుకొలది పట్టుసడలు
కడకువడలుకమిలి కాంతివిహీనమౌ
సిరులనొసగుబాటశివునిమాట

★★★★★★★★★★★★★★★★★
వయసు మీదపడగ ◆వశముదప్పుతనువు
కనగవస్తుతతియు ◆కళలుతప్పు
తనువు తత్వమిదియె ◆తరుగునాయువెపుడు
విశ్వజనహితోక్తి!◆విష్ణుసూక్తి!!
★★★★★★★★★★★★★★★★★★★★

12, జనవరి 2017, గురువారం

బొట్టు పెట్టినంత బుద్ధిమంతుడు కాదు
పెట్టనంత గాదు పిన్నవాడు
మనసు తీరు బట్టి మనిషి నడత యుండు
నందిపాటి నోట నరుల మాట!

పంచ కట్టి నంత పరమాత్ముడైపోడు
కట్టనంత గాదు కాని వాడు
పెద్దమనసు చాలు పెద్దరికానికి
నందిపాటి నోట నరుల మాట!

11, జనవరి 2017, బుధవారం

ఇవాళ లాల్ బహుద్దూర్ శాస్త్రి గారి వర్ధంతి ఆసందర్భంగా

,
అంశం:శ్రీ లాల్ బహుద్దూర్ శాస్త్రి

ఆ.వె:పాఠములను నేర్పు పంతులింటను బుట్టె
       పేదరికములోనె విద్య నేర్చె
        బాల్యమందె తండ్రి పరమపదింపగా
        తాతగారి యింట తాను పెరిగె.

ఆ.వె:మచ్చలేని నేత మహిలోన నీశాస్త్రి
       ప్రజల సొమ్ము తాక వలదటంచు
        హితవు తాను తెలిపె నింపుగా  జనులకు
        నాచరించి చూపె ననవరతము.

ఆ.వె:జాతి సతము తలచు జననేత శాస్త్రీజి
       మరువబోకు మెపుడు మహిని నీవు
        నీతి నియమములకు నేస్తమీతడటన్న
     నతిశయోక్తి కాద  నరయుడయ్య .

ఆ.వె:శాంతి ముఖ్యమనెడిసందేశ మొసగుచు
         దేశనేత యైన ధీరు డితడు
          పొట్టి వాడ యినను గట్టి వాడు యనెడి
          మెప్పు బడసినట్టి గొప్పనేత.                                              

ఆ.వె: జైకిసానటంచు జగతిలో రైతన్న
           గొప్పచాటె నెంతొ కూర్మి తోడ
            ఆత్మబంధువయ్యె నన్నదాతలకెల్ల
            కోటికొక్కరుంద్రు కువలయమున.                                        

ఆ.వె:భరత జాతి కొరకు ప్రాణముల్ వీడుచు
          నమరుడయ్యె నేత  యవని యందు
           వారు నడచి నట్టి బాట ననుసరించ
             వడిగ రండు మీరు  యడుగు లేయ.

6, జనవరి 2017, శుక్రవారం

కం.
నడకను సాగించినచో l
కడుసన్నగ యయ్యెదవిక కడుపే రాదోయ్ l
కడుపే వచ్చిన నీకే l
చెడురోగము లొచ్చునింక చెప్పే దినవోయ్ ll
                                     

4, జనవరి 2017, బుధవారం

:)  is it?
Conference:
The confusion of one man multiplied by the number present.

Compromise:
The art of dividing a cake in such a way that everybody believes he got the biggest piece.

Conference Room:
A place where everybody talks, nobody listens & everybody disagrees later on.

Committee:
Individuals who can do nothing individually and sit to decide that nothing can be done together.

Politician:
One who shakes your hand before elections and your Confidence after.
=====
Experience :
The name men give to their mistakes.

Atom Bomb:
An invention to end all inventions.

Philosopher :
A fool who torments himself during life, to be spoken of when dead.

Diplomat:
A person who tells you to go to hell in such a way that you actually look forward to the trip.

Different Opportunist:
A person who starts taking bath if he accidentally falls into a river.

Too much Optimist:
A person who while falling from Eiffel Tower says in midway See I am not injured yet.

Too much Pessimist:
A person who says that O is the last letter in ZERO, Instead of the first letter in word OPPORTUNITY

Miser:
A person who lives poor so that he can die rich.

Father:
A banker provided by nature.

Criminal:
A guy no different from the rest... Except that he got caught.

Boss:
Someone who is early when you are late and late when you are early.

Experience :
The name men give to their mistakes.

Philosopher :
A fool who torments himself during life, to be spoken of when dead.

Doctor:
A person who kills your ills by pills, and kills you with his bills .

:)