26, ఫిబ్రవరి 2016, శుక్రవారం

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె

ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడి పుచ్చినయమ్మ తన్ను లో

నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా

యమ్మ కృపాబ్ధ్హియిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్.
(భాగ -ప్ర -౮)
ఇది వందన భూమి అభినందనభూమి
ఇదిఅర్పణభూమి హృదయార్పణ భూమి
1.అణువణువున మాతృత్వం 
అంతరాళ దైవత్వం
భరతమాతజైయనియెడి
నినాదమే పవిత్రం
ఇదివందనభూమి.
2.నాదేశపు సందేశం భగవద్గీత
నాజాతికె ఆదర్శం పవిత్రసీత
నాదేశపుఅమృతఝరిపావనగంగ
నాదేశం నాకధునీహృదయాంతరంగ
ఇదివందనభూమి

20, ఫిబ్రవరి 2016, శనివారం

శాతవాహనుల వంశాన పుట్టిన వాడు
కాకతీయుల పోతుగడ్డ మెట్టినవాడు
పల్లెలోనే కాదు డిల్లీలో సైతమ్ము
పెద్దగద్దేలనేలి పెరుకేక్కినవాడు
ఎవడయ్య ఎవడు వాడు ఇం
కెవడయ్య తెలుగువాడు.
పంచె కట్టుటలో మొనగాడు
కండువాలేనిధే గడపదాటని వాడు
పంచబక్ష్యాలు తన కంచాన వడ్డించ
గోంగూర కోసమై గుటకలేసువాడు
ఎవడయ్య ఎవడు వాడు ఇం
కెవడయ్య తెలుగువాడు.
నేల నల్దేసల డేరాలు నాటినవాడు
అన్ని మూసలలోన అట్టే ఒదిగినవాడు
"ఎ దేసమేగిన ఎందుకాలిడినా"
ఆవకాయ వియోగామసలె సైపని వాడు
ఎవడయ్య ఎవడు వాడు ఇం
కెవడయ్య తెలుగువాడు.
మంచి మనసెదురైన మాలలిచ్చేవాడు
భాయీ భాయీ అన్న చేయి కలిపేవాడు
తిక్కరేగిందంటే డొక్కా చీల్చేవాడు
చిక్కులెరుగని వాడు చిత్తాన పసివాడు
ఎవడయ్య ఎవడు వాడు ఇం
కెవడయ్య తెలుగువాడు.

15, ఫిబ్రవరి 2016, సోమవారం

నీ పూజ కోసం పూలుతెద్దామని పొద్దున్నే పూలతోటలోకి వెళ్లాను..ప్రభూ..
ఉదయశ్రీ ఆరుణారున కాంతులతో ఉద్యానం కళకళలాడుతోంది
పూలబాలలన్నియూ అమ్మవడిలో వూయలలూగుచున్నవి...
అపుడు....
నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి గో
రానెడు నంతలోన విరులన్నియు జాలిగనోళ్ళు విప్పి మా
ప్రాణము తీతువా యనుచుబావురుమన్నవి కృంగిపోతి నా
మానసమందేదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై..
అంతలో ఒక సన్నజాజికన్నె సన్నని గొంతుకతో నన్ను చూసి యిలా అంది ప్రభు
ఆయువుగల్గు నాల్గు గడియల్ కనిపించిన తీవతల్లి జా
తీయత దిద్ది తీర్తుము, తదీయ కరమ్ములలోన స్వేచ్చ్చమై
ఊయల లూగుచు మురుయుచుందుము,,ఆయువు తీరినంతనే
హాయిగ కన్ను మూసెదము,ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై
ఎందుకయ్యా మా స్వేచ్చ జీవనానికి అడ్డు వస్తావు మేము నీకేం అపకారము చేసాము
గాలిని గౌరవింతుము సుగంధము పూసి మమ్మాశ్రయించు బృం
దాలకు విందు చేసెదము కమ్మని తేనెలు, మిమ్ముబోంట్ల నే
త్రాలకు హాయి గూర్తుము, స్వతంత్రులు మమ్ముల స్వార్ధబుద్ధితో
తాలుము త్రుంచ బోకుము... తల్లికి బిడ్డకి వేరుచేతువే...!!!
యింతలో ఒక గులాబి బాల కోపంతో మొగమంతా ఎర్రబడి యిలా అంది ప్రభూ..
ఊలు దారాలతో గొంతుకురి బిగించి
గుండెలోనుండి సూదులు గుచ్చి కూర్చి,
ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము
అకట దయలేనివారు మీ యాడవారు
పాపం మీరు దయాదాక్షిణ్యాలుగల మానవులు కావోలునే
మా వెలలేని ముగ్ధసుకుమార సుగంధ మరంద మాధురీ
జెవితమెల్ల మీకయి త్యజించి.. కృశించి.. నశించిపోయే
మా యౌవనమెల్ల కొల్లగొని, ఆపై చీపురుతోడ చిమ్మి
మమావల పారబోతురుగదా.. నరజాతికి నీతియున్నదా
:వోయీ మానవుడా
బుద్ధదేవుని భూమిలో పుట్టినావు
సహజమగు ప్రేమ నీలోన చచ్చెనెమో
అందమును హత్య చేసెడు హంతకుండా
మైలపడిపోయెనో నీదు మనుజ జన్మ..!!
అని దూషించు పూలకన్నియల కోయలేక
వట్టిచేతులతో వచ్చిన నాయీ హృదయ కుసుమాంజలి
గైకొని నాపై నీ కరుణశ్రీ రేఖలను ప్రసరింపుము ప్రభు.....!!!